85 ఏళ్లు… 7000 వికెట్లు… త్వరలో రిటైర్మెంట్‌!

85 ఏళ్లు... 7000 వికెట్లు... త్వరలో రిటైర్మెంట్‌!

వెస్టిండీస్‌ దిగ్గజాలు వివ్‌ రిచర్డ్స్‌, గ్యారీ సోబర్స్‌, జోయెల్‌ గార్నర్‌, ఫ్రాంక్‌ వోరెల్‌తో కలిసి ఆడిన సెసిల్‌ రైట్‌ ఎట్టకేలకు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. రెండు వారాల్లో 85వ వసంతంలోకి అడుగు పెడుతుండటంతో ఆటకు దూరం అవుతున్నానని ప్రకటించారు. ఫాస్ట్‌ బౌలరైన రైట్‌ మొదట బార్బడోస్‌తో మ్యాచ్‌లో జమైకాకు ప్రాతినిధ్యం వహించాడు. గ్యారీ సోబర్స్‌కు ప్రత్యర్థిగా తలపడ్డాడు. 1959లో ఇంగ్లాండ్‌ వెళ్లి సెంట్రల్‌ లాంకాషైర్‌కు ఆడాడు. ఎనిద్‌ను పెళ్లాడి అక్కడే స్థిరపడ్డాడు. రైట్‌ తన 60 ఏళ్లకు పైగా కెరీర్‌లో 7000కు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 28, 2019 | 1:03 AM

వెస్టిండీస్‌ దిగ్గజాలు వివ్‌ రిచర్డ్స్‌, గ్యారీ సోబర్స్‌, జోయెల్‌ గార్నర్‌, ఫ్రాంక్‌ వోరెల్‌తో కలిసి ఆడిన సెసిల్‌ రైట్‌ ఎట్టకేలకు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. రెండు వారాల్లో 85వ వసంతంలోకి అడుగు పెడుతుండటంతో ఆటకు దూరం అవుతున్నానని ప్రకటించారు. ఫాస్ట్‌ బౌలరైన రైట్‌ మొదట బార్బడోస్‌తో మ్యాచ్‌లో జమైకాకు ప్రాతినిధ్యం వహించాడు. గ్యారీ సోబర్స్‌కు ప్రత్యర్థిగా తలపడ్డాడు. 1959లో ఇంగ్లాండ్‌ వెళ్లి సెంట్రల్‌ లాంకాషైర్‌కు ఆడాడు. ఎనిద్‌ను పెళ్లాడి అక్కడే స్థిరపడ్డాడు.

రైట్‌ తన 60 ఏళ్లకు పైగా కెరీర్‌లో 7000కు పైగా వికెట్లు తీశాడు. ఒకానొక దశలో ఐదు సీజన్లలో 538 వికెట్లు తీసి సంచలనం సృష్టించారు. అంటే దాదాపు 27 బంతులకు ఓ వికెట్‌ పడగొట్టాడు. ఇంత సుదీర్ఘంగా క్రికెట్‌ ఆడటానికి కారణం ఉందని రైట్‌ వెల్లడించాడు. ‘అంతా సవ్యంగా సాగుతోంది. ఇంత సుదీర్ఘంగా కొనసాగడానికి కారణాలేంటో నాకు తెలుసు. అవేంటో మీకు చెప్పను. నాకు నచ్చిన ప్రతి ఆహారాన్ని తినేవాడిని. ఎక్కువగా తాగను. ఎప్పుడో ఓసారి ఒక బీర్‌ సేవిస్తాను. నేనెప్పుడు ఫిట్‌గా ఉంటాను. ఈ మధ్యన నా వయసును సాకుగా చూపి సాధనకు వెళ్లడం లేదు. ఇంట్లో కూర్చొని టీవీ చూడటం నాకిష్టం ఉండదు. బయటకెళ్లి ఏదో ఓ పని చేయడం ఇష్టం’ అని రైట్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 7న పెన్నీ లీగ్‌లో అప్పర్‌మిల్‌ తరఫున స్ప్రింగ్‌హెడ్‌పై మ్యాచ్‌ ఆడి  ఆయన వీడ్కోలు తీసుకుంటారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu