AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harmanpreet Kaur: మాకు కావాలి ఓ ఐపీఎల్‌.. త్వరలోనే మా కల నిజమవుతుందనుకుంటున్నా.. హర్మన్‌ ఆశాభావం..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీతో ఎంతోమంది వర్ధమాన క్రికెటర్ల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడానికి యంగ్‌ క్రికెటర్స్‌కు ఇదొక చక్కని వేదికగా మారింది.

Harmanpreet Kaur: మాకు కావాలి ఓ ఐపీఎల్‌.. త్వరలోనే మా కల నిజమవుతుందనుకుంటున్నా.. హర్మన్‌ ఆశాభావం..
Basha Shek
|

Updated on: Nov 24, 2021 | 9:48 PM

Share

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీతో ఎంతోమంది వర్ధమాన క్రికెటర్ల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడానికి యంగ్‌ క్రికెటర్స్‌కు ఇదొక చక్కని వేదికగా మారింది. అందుకు తగ్గట్లే ఈ పొట్టిఫార్మాట్‌ క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉంటోంది. ఈ నేపథ్యంలో మహిళలకు కూడా ఓ ఐపీఎల్‌ టోర్నీ ఉండాలంటోంది టీమిండియా మహిళల టీ 20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌. చాలామంది లాగే తాను కూడా మహిళల ఐపీఎల్‌ కోసం ఎదురుచూస్తున్నానని, త్వరలోనే తన కల నెరవేరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మహిళల బిగ్‌బాష్‌ టోర్నీలో హర్మన్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ చాటింది. మెల్‌బోర్న్‌ రెనేగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆమె 14 మ్యాచ్‌ల్లో 399 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసింది. దీంతో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు కైవసం చేసుకుంది. కాగా ఇండియా నుంచి ఈ పురస్కారం దక్కించుకున్న మొదటి మహిళా క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కావడం విశేషం.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ‘నా కెరీర్‌లో ఇదొక పెద్ద అచీవ్‌మెంట్. నాకు మద్దతుగా నిలిచిన జట్టుకు, సహాయక బృందానికి ధన్యవాదాలు. నా నుంచి జట్టు ఏం ఆశిస్తుందో అది ఇవ్వడానికి వందశాతం ప్రయత్నిస్తాను. నా ప్రదర్శన మరికొంత మంది మహిళా క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాను. ఇక పురుషుల్లాగే మాకోసం కూడా పూర్తి స్థాయిలో ఐపీఎల్‌ టోర్నీ నిర్వహిస్తే బాగుంటుంది. నాతో పాటు చాలామంది మహిళా క్రికెటర్లు ఈ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. త్వరలోనే మా కల నిజమవుతుందని అనుకుంటున్నాం. టోర్నీలో బెస్ట్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇవ్వడం వరకు మా బాధ్యత. ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ, ఐపీఎల్‌ బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి’ అని చెప్పుకొచ్చింది.

Also Read:

Womens Cricket: 4-1- 8- 5.. అదిరిపోయే స్పెల్‌ వేసిన ఆసీస్‌ మహిళా క్రికెటర్‌.. బీబీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు..

Ajaz Patel, sodhi: న్యూజిలాండ్ జట్టులో భారత సంతతి బౌలర్లు.. కాన్పూర్ టెస్ట్‎లో రాణిస్తారా..

Gautam Gambhir: చంపేస్తాం.. గౌతమ్ గంభీర్‌కు టెర్రరిస్టుల నుంచి బెదిరింపులు..