AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీ నంబర్ వన్.. ఇషాన్‌ను వెనక్కి నెట్టిన అక్షర్ పటేల్

Virat Kohli: భారత్, న్యూజిలాండ్ ఐదు వన్డేల సిరీస్‌లో భారత బ్యాటర్ల ప్రదర్శన నిరాశపరిచింది. విరాట్ కోహ్లీ 86 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ 74 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, రెండు మ్యాచ్‌ల్లోనే 73 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ మూడో స్థానంలో నిలిచాడు.

Virat Kohli: కోహ్లీ నంబర్ వన్.. ఇషాన్‌ను వెనక్కి నెట్టిన అక్షర్ పటేల్
Virat Kohli
Rakesh
|

Updated on: Nov 15, 2026 | 2:35 PM

Share

Virat Kohli: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా బ్యాటర్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ సిరీస్‌లో ఒక్క భారత బ్యాటర్ కూడా సెంచరీ చేయలేకపోయాడు. కనీసం 100 పరుగుల మార్కును కూడా ఎవరూ అందుకోలేకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లీ 86 పరుగులతో భారత బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే అతడి తర్వాతి స్థానాల్లో అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ ఉండటం విశేషం. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో కోహ్లీ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 86 పరుగులు చేశాడు. తొలి వన్డేలో 74 పరుగులతో రాణించిన అతడు, ఆ తర్వాతి మూడు ఇన్నింగ్స్‌ల్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 12 పరుగులే చేశాడు. అయినప్పటికీ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరే 74 కావడం భారత బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పడుతోంది.

ఇషాన్ కంటే ముందున్న అక్షర్ పటేల్

ఈ పరుగుల జాబితాలో అక్షర్ పటేల్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతడు 74 పరుగులు చేశాడు. ఐదో వన్డేలో 46 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే 73 పరుగులు సాధించాడు. ఐదో వన్డేలో అతడూ 46 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో వెనుదిరిగాడు. అక్షర్, ఇషాన్ మధ్య తేడా ఒక్క పరుగు మాత్రమే కావడం విశేషం.

ఇది కూడా చదవండి: IND vs PAK U19 Final: పాకిస్థాన్‌ను మట్టికరిపించి ఆసియా కప్ కైవసం చేసుకున్న భారత్

రోహిత్, అయ్యర్, గిల్ పరుగులివే

భారత స్టార్ బ్యాటర్లలో రోహిత్ శర్మ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 30 పరుగులే చేశాడు. శ్రేయస్ అయ్యర్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 67 పరుగులు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు. నామన్ ధీర్ 60 పరుగులతో టాప్-5లో చోటు సంపాదించాడు. శుభ్‌మన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 37 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 29 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 23 పరుగులకే పరిమితమయ్యాడు.

భారత బ్యాటర్ల పరుగుల జాబితా ఇదే

86 పరుగులు – విరాట్ కోహ్లీ (4 ఇన్నింగ్స్‌లు)

74 పరుగులు – అక్షర్ పటేల్ (4 ఇన్నింగ్స్‌లు)

73 పరుగులు – ఇషాన్ కిషన్ (2 ఇన్నింగ్స్‌లు)

67 పరుగులు – శ్రేయస్ అయ్యర్ (4 ఇన్నింగ్స్‌లు)

ఇది కూడా చదవండి: Mohit Ulva: ఓటమి అంచు నుంచి విజయ శిఖరాలకు.. భారత్‌ను గెలిపించిన మోహిత్

60 పరుగులు – నామన్ ధీర్ (4 ఇన్నింగ్స్‌లు)

37 పరుగులు – శుభ్‌మన్ గిల్ (2 ఇన్నింగ్స్‌లు)

30 పరుగులు – రోహిత్ శర్మ (4 ఇన్నింగ్స్‌లు)

29 పరుగులు – కేఎల్ రాహుల్ (2 ఇన్నింగ్స్‌లు)

23 పరుగులు – రుతురాజ్ గైక్వాడ్ (2 ఇన్నింగ్స్‌లు)

14 పరుగులు – అర్ష్‌దీప్ సింగ్ (2 ఇన్నింగ్స్‌లు)

14 పరుగులు – మహమ్మద్ సిరాజ్ (1 ఇన్నింగ్స్‌)

ఐదో వన్డేలోనూ బ్యాటింగ్ తడబాటు

ఐదో వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ చెరో 46 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. అయితే రోహిత్ శర్మ 7, విరాట్ కోహ్లీ 5 పరుగులకే వెనుదిరిగారు. చివర్లో మహమ్మద్ సిరాజ్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, అర్ష్‌దీప్ సింగ్ కూడా 14 పరుగులు చేశాడు. చివరి వికెట్‌కు వీరిద్దరూ 26 పరుగులు జోడించడంతో భారత్ 200 పరుగుల మార్కును దాటగలిగింది. న్యూజిలాండ్ ముందు 210 పరుగుల లక్ష్యం నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బెండకాయలు తింటే నిజంగా లెక్కలు బాగా వస్తాయా?
బెండకాయలు తింటే నిజంగా లెక్కలు బాగా వస్తాయా?
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి