AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Pak: దీపావళి రోజే మొదలైన వివాదం.. పాక్‌పై భారత కుర్రాళ్ల దూకుడు వెనుక అసలు కారణం ఇదే

Ind vs Pak: అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. గెలుపు తర్వాత భారత ఆటగాళ్లు చేసిన దూకుడైన సంబరాల వెనుక కారణాన్ని యశ్‌వీర్ గౌడ్ వెల్లడించాడు. దీపావళి రోజున జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం జరిగిందని, దూషణలు కూడా చోటుచేసుకున్నాయని తెలిపాడు.

Ind vs Pak: దీపావళి రోజే మొదలైన వివాదం.. పాక్‌పై భారత కుర్రాళ్ల దూకుడు వెనుక అసలు కారణం ఇదే
Ind Vs Pak
Rakesh
|

Updated on: Nov 16, 2026 | 8:02 AM

Share

Ind vs Pak: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ తొమ్మిదోసారి టైటిల్ గెలుచుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజయం సాధించారు. గెలుపు ఖరారైన వెంటనే భారత ఆటగాళ్లు మైదానంలో చేసిన సంబరాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. పాక్ ఆటగాళ్ల ముందుకు వెళ్లి మరీ కొందరు భారత క్రికెటర్లు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ దూకుడుపై విమర్శలు రావడంతో అసలు కారణాన్ని భారత ఆటగాడు యశ్‌వీర్ గౌడ్ వెల్లడించాడు.

దీపావళి మ్యాచ్‌లో ఏం జరిగింది?

ఆసియా కప్ ఫైనల్‌కు ముందు భారత్, పాకిస్థాన్ జట్లు లీగ్ దశలో దీపావళి రోజున తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. భారత జట్టు ఓటమి తర్వాత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగినట్లు యశ్‌వీర్ తెలిపాడు. ఈ సందర్భంగా దూషణలు కూడా చోటుచేసుకున్నాయని చెప్పాడు. మ్యాచ్ ఓడిపోవడంతో భారత ఆటగాళ్లు అప్పుడు స్పందించలేకపోయారని, ఫైనల్లో మరోసారి పాకిస్థాన్‌ను ఎదుర్కొనే అవకాశం కోసం ఎదురుచూశారని వివరించాడు.

ఫైనల్‌లో గెలిచి లెక్క సరిచేసిన భారత్

నవంబర్ 14న ఒమన్‌లో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి 337 పరుగులు చేసింది. భారత్ ముందు 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు ఒక దశలో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అయితే మనాల్ చౌహాన్ 47 పరుగులు, మోహిత్ ఉల్వా అజేయంగా 49 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన సమయంలో మోహిత్ బౌండరీ బాదడంతో భారత్ 339/9 స్కోరుతో విజయం సాధించింది. దీంతో ఒక్క వికెట్ తేడాతో పాక్‌ను ఓడించి తొమ్మిదోసారి అండర్-19 ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది.

మా సంబరాలకు కారణం అదే

ఫైనల్ విజయం తర్వాత భారత ఆటగాళ్లు ఎందుకంత భావోద్వేగంతో సంబరాలు చేసుకున్నారనే విషయాన్ని యశ్‌వీర్ గౌడ్ స్పోర్ట్స్ టుడేతో మాట్లాడాడు. దీపావళి మ్యాచ్‌లో ఓడిపోయినప్పుడు ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం జరిగిందని, దూషణలు కూడా ఉన్నాయని చెప్పాడు. ఓడిపోయిన తర్వాత తాము ఏమీ మాట్లాడలేకపోయామని, ఫైనల్ కోసం ఎదురుచూశామని వివరించాడు. మంచి ప్రదర్శనతో భారత్ సత్తా ఏంటో చూపించాలనుకున్నామని తెలిపాడు.

వాళ్లు చేసినట్టే మేమూ స్పందించాం

ఫైనల్ గెలిచిన తర్వాత చేసిన సంబరాలు గత మ్యాచ్‌లో జరిగిన సంఘటనలకు ప్రతిస్పందనగా ఉన్నాయని యశ్‌వీర్ చెప్పాడు. గతంలో పాక్ ఆటగాళ్లు ఎలా ప్రవర్తించారో, తాము కూడా అదే భావోద్వేగంతో స్పందించామని వివరించాడు. భారత జెర్సీ ధరించి ఆడుతున్నప్పుడు ఈ విజయం తమకు ఎంతో ప్రత్యేకమని అన్నాడు. ప్రతి ఒక్కరూ ఆ క్షణం కోసం ఎదురుచూశారని చెప్పాడు. దీంతో భారత ఆటగాళ్ల దూకుడైన సంబరాల వెనుక దీపావళి మ్యాచ్‌లో జరిగిన మాటల యుద్ధమే ప్రధాన కారణమని యశ్‌వీర్ వ్యాఖ్యలతో స్పష్టమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us