AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీరీస్ కైవసం

టీమిండియా సారథి.. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో.. భారత్ మూడు వన్డేల సీరీస్‌ను కైవసం చేసుకుంది. వెస్టీండీస్‌తో జరిగిన మూడు వన్డేల సీరీస్‌లో తొలి మ్యాచ్ వర్షంతో రద్దవ్వగా.. రెండో మ్యాచ్ భారత్ నెగ్గింది. ఇక చివరి మ్యాచ్‌కు ప్రారంభంలోనే వరుణుడు ఆటంకం కలిగించడంతో.. మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్..35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌ 41 బంతుల్లో 72 పరుగులు […]

కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీరీస్ కైవసం
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 15, 2019 | 5:12 AM

Share

టీమిండియా సారథి.. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో.. భారత్ మూడు వన్డేల సీరీస్‌ను కైవసం చేసుకుంది. వెస్టీండీస్‌తో జరిగిన మూడు వన్డేల సీరీస్‌లో తొలి మ్యాచ్ వర్షంతో రద్దవ్వగా.. రెండో మ్యాచ్ భారత్ నెగ్గింది. ఇక చివరి మ్యాచ్‌కు ప్రారంభంలోనే వరుణుడు ఆటంకం కలిగించడంతో.. మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్..35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌ 41 బంతుల్లో 72 పరుగులు చేయగా.. లూయిస్‌ 29 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఆరంభాన్నిచ్చారు. దీంతో 35 ఓవర్లలో భారీ స్కోర్ నమోదు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్ మూడు‌, షమి రెండు వికెట్లు పడగొట్టారు. అయితే డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 255 పరుగులుగా నిర్దేశించారు.

దీంతో 255 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రంగంలోకి దిగిన భారత్.. ఆరంభంలోనే రోహిత్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం సారథి విరాట్‌ కోహ్లీ 99 బంతుల్లో 114 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా మరోసారి రెచ్చపోయాడు. 41 బంతుల్లో 65 పరుగులు చేశాడు. 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కోహ్లీసేన లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దైంది.

Follow Us
ఓటింగ్‌లో దూసుకుపోతున్న కామనర్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..!
ఓటింగ్‌లో దూసుకుపోతున్న కామనర్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..!
EV or CNG కార్.. మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చుల్లో ఏది బెస్ట్..!
EV or CNG కార్.. మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చుల్లో ఏది బెస్ట్..!
గుడికి వెళ్లే టైమ్ లేదా?.. ఇంట్లోనే ఇలా చేస్తే సరిపోతుందట!
గుడికి వెళ్లే టైమ్ లేదా?.. ఇంట్లోనే ఇలా చేస్తే సరిపోతుందట!
మాదాపూర్‌లో మహా మత్తు దందా..వాట్సాప్ ఆర్డర్లు..ర్యాపిడో డెలివరీలు
మాదాపూర్‌లో మహా మత్తు దందా..వాట్సాప్ ఆర్డర్లు..ర్యాపిడో డెలివరీలు
నోస్ బ్లీడింగ్ నుంచి కడుపు ఉబ్బరం వరకు.. ఈ లక్షణాలుంటే అలర్ట్
నోస్ బ్లీడింగ్ నుంచి కడుపు ఉబ్బరం వరకు.. ఈ లక్షణాలుంటే అలర్ట్
కూకట్‌పల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..
కూకట్‌పల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..
రోజువారీ కాఫీతో కాలేయానికి ఆరోగ్యం! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రోజువారీ కాఫీతో కాలేయానికి ఆరోగ్యం! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బిగ్‌బాస్ హౌస్ గోడ దూకి బయటకు పారిపోయిన కంటెస్టెంట్.. వీడియో
బిగ్‌బాస్ హౌస్ గోడ దూకి బయటకు పారిపోయిన కంటెస్టెంట్.. వీడియో
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్ చలానాలపై భారీ డిస్కౌంట్..
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్ చలానాలపై భారీ డిస్కౌంట్..
యువకుడిపై యాసిడ్‌ దాడి, పరిస్థితి విషమం!
యువకుడిపై యాసిడ్‌ దాడి, పరిస్థితి విషమం!