ఇండోనేషియా ఓపెన్: రెండో రౌండ్‌లోకి సింధు, శ్రీకాంత్

ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000లో భారత షట్లర్లు చెలరేగిపోతున్నారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు తేజాలు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో జపాన్‌కు చెందిన అయా ఒహోరితో తలపడిన సింధు 11-21, 21-15, 21-15తేడాతో ఆమెపై విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో జపాన్‌కు చెందిన కెంటా నొషిమోటోతో తలపడిన కిడాంబి శ్రీకాంత్ 21-14, 21-13 తేడాతో అతడిపై గెలుపొందాడు. కాగా మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:44 pm, Wed, 17 July 19
ఇండోనేషియా ఓపెన్: రెండో రౌండ్‌లోకి సింధు, శ్రీకాంత్

ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000లో భారత షట్లర్లు చెలరేగిపోతున్నారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు తేజాలు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో జపాన్‌కు చెందిన అయా ఒహోరితో తలపడిన సింధు 11-21, 21-15, 21-15తేడాతో ఆమెపై విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో జపాన్‌కు చెందిన కెంటా నొషిమోటోతో తలపడిన కిడాంబి శ్రీకాంత్ 21-14, 21-13 తేడాతో అతడిపై గెలుపొందాడు.

కాగా మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కిరెడ్డి, ప్రణవ్ జెర్రీ చోప్రా ద్వయం 25-23, 16-21, 21-19 తేడాతో నెదర్లాండ్‌కు చెందిన రాబిన్ తాబెలింగ్, సెలీనా పీక్ విజయం సాధించారు. రెండో రౌండ్‌లో వీరు చైనాకు చెందిన జెంగ్ సి వెయ్, హాంగ్ యా గ్యోంగ్‌తో తలపడనున్నారు. అలాగే పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి 21-19, 18-21, 21-19 తేడాతో చిరాగ్ శెట్టి గోజెఫీ, నుర్ ఇజాముద్దీన్‌పై పై చేయి సాధించారు. రెండో రౌండ్‌లో వీరు ఇండోనేషియాకు చెందిన మార్కస్ ఫెర్నాల్డి జిడోన్, కెవిన్ సంజయ్ సుకముల్జితో తలపడనున్నారు. అయితే మహిళల డబుల్స్‌తో సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప జోడికి మొదటి రౌండ్‌లో నిరాశ ఎదురైంది. మలేషియాకు చెందిన వివియన్ హో, యప్ చెంగ్ వెన్‌తో వీరిద్దరు 20-22, 22-20, 20-22 తేడాతో ఓడిపోయారు.