ఆడింది చాలు.. ధోని రిటైర్మెంట్‌పై పేరెంట్స్ విష్!

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్‌పై కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక అతడి తల్లిదండ్రులు కూడా ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నట్లు చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ వెల్లడించాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుని ధోనికి ఘనంగా ఫేర్‌వెల్ ఇవ్వాలని టీమిండియా భావించగా.. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీనితో ధోని రిటైర్మెంట్ […]

ఆడింది చాలు.. ధోని రిటైర్మెంట్‌పై పేరెంట్స్ విష్!
Follow us

|

Updated on: Jul 17, 2019 | 5:47 PM

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్‌పై కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక అతడి తల్లిదండ్రులు కూడా ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నట్లు చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ వెల్లడించాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుని ధోనికి ఘనంగా ఫేర్‌వెల్ ఇవ్వాలని టీమిండియా భావించగా.. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీనితో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు జోరుగా వచ్చాయి. అయితే దానిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు.

వెస్టిండీస్ టూర్‌కు ఎంపికపై సందిగ్దత..

ఇది ఇలా ఉండగా శుక్రవారం టీమిండియా సెలక్షన్ కమిటీ ముంబై‌లో సమావేశమై వెస్టిండీస్ టూర్‌కు జట్టును ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో ధోనిని వాళ్ళు ఎంపిక చేస్తారా.? లేదా అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

ధోని తల్లిదండ్రుల మాట…

అటు ఈ విషయంపై ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెబితేనే బాగుంటుందని అత‌డి త‌ల్లిదండ్రులు  కోరుకుంటున్నారని ఆయన వెల్ల‌డించారు. “గ‌త ఆదివారం నేను ధోనీ ఇంటికి వెళ్లి అత‌ని త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడాను. ధోనీ ఇక క్రికెట్‌ను విడిచిపెడితే బాగుంటుంద‌ని వారు కోరుకుంటున్నారు” అని ఆయన తెలిపాడు.

చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ మాట…

ఇంతకాలం ధోని క్రికెట్‌ను ఎంతో ఇష్టంతో ఆడాడని.. ఇప్పటికైనా రిటైర్మెంట్ ప్రకటించి.. తమతో పాటు ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నట్లు అతడి తల్లిదండ్రులు ఆశిస్తున్నట్లు కేశవ్ బెనర్జీ చెప్పుకొచ్చారు. అయితే ధోని వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని తాను అనుకుంటున్నట్లు కేశవ్ తన మనసులోని మాటను పంచుకున్నాడు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..