Shardul Thakur: ఆ సీట్ పొందడం కంటే ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోవడమే చాలా ఈజీ.. టీమిండియా క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Shardul Thakur: ట్రైన్ జర్నీని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. అయితే ట్రైన్‌లో సీటు దక్కడం మాత్రం అంత ఈజీ కాదు. సీటు కోసం ప్రయాణికులు..

Shardul Thakur: ఆ సీట్ పొందడం కంటే ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోవడమే చాలా ఈజీ.. టీమిండియా క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
శార్దూల్ ఠాకూర్
Follow us

|

Updated on: Jan 24, 2021 | 6:30 PM

Shardul Thakur: ట్రైన్ జర్నీని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. అయితే ట్రైన్‌లో సీటు దక్కడం మాత్రం అంత ఈజీ కాదు. సీటు కోసం ప్రయాణికులు చాలా తిప్పలు పడుతారు. ముఖ్యంగా లోకల్ ట్రైన్స్‌లో పరిస్థితి మరీ దారుణం అని చెప్పాలి. ఫుట్‌పాత్‌పై నిలబడి వెళ్లే సందర్భాలు కూడా కోకొల్లలు. ముంబై యంగ్ స్టార్, టీమిండియా పేసర్‌ శార్దూల్ ఠాకూర్ కూడా ట్రైన్‌లో సీటు కోసం చాలా ఇబ్బందులు పడ్డాడట. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రైన్‌లో సీటు దొరకడంపై శార్దూల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రైన్‌లో సీట్ దక్కించుకోవడం కంటే క్రీజ్‌లో ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఎంతో ఈజీ అని అన్నాడు. శార్దూల్ ఇంకా ఏమన్నాడంటే..

‘‘ముంబై లోకల్ ట్రైన్‌లో సీటు పొందడం చాలా కష్టం. ట్రైన్ సీటు దొరకబుచ్చుకోవాలంటే టైమింగ్, స్కిల్స్ అవసరం. దానికంటే క్రీజ్‌లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం చాలా ఈజీ. ఫాస్ట్ బౌలింగ్‌ అంటే నాకు అస్సలు భయం లేదు. పైగా ఫాస్ట్ బౌలింగ్‌లో ఆడటాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. కానీ, ట్రైన్‌లో సీటు దక్కించుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాలి’ అంటూ శార్దూల్ చమత్కరించాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శార్దూల్ ఇటు బ్యాటింగ్‌లోనూ అటు బౌలింగ్‌లోనూ ఇరగదీశాడు. జట్టు విజయాల్లో శార్దూల్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సిరీస్‌లో నాలుగ టెస్ట్‌ మ్యాచ్‌లో అయితే శార్దూల్ తన బ్యాట్‌ను ఝుళిపించడంతో పాటు బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు. మ్యాచ్‌లో మొత్తం 4 వికెట్లు పడగొట్టిన శార్దూల్.. 67 పరుగులు చేసి జట్టు విజయానికి దోహదం అయ్యాడు.

Also read:

వరంగల్‌లో అంగన్‌వాడీ వర్కర్ మృతి.. అనుమానం వ్యక్తం చేసిన కుటుంబసభ్యలు.. ఆరా తీస్తున్న అధికారులు

Road Accident: గుజరాత్ రాష్ట్రంలో సూరత్ వద్ద రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ఇద్దరు మృతి..