శ్రీలంక క్రికెటర్‌ కుశాల్‌ అరెస్ట్

శ్రీలంక క్రికెటర్‌ కుశాల్‌ మెండిస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ యాక్సిడెంట్‌ కేసులో ఆదివారం ఈ వికెట్‌ కీపర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీలంక క్రికెటర్‌ కుశాల్‌ అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 2:28 PM

శ్రీలంక క్రికెటర్‌ కుశాల్‌ మెండిస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ యాక్సిడెంట్‌ కేసులో ఈ వికెట్‌ కీపర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కొలంబో శివారులోని పనాదుర వద్ద ఈ ఉదయం కుశాల్ మెండిస్ ప్రయాణిస్తోన్న కారు, సైకిల్‌పై వెళ్తున్న 64 ఏళ్ల వృద్దుడిని ఢీకొంది. ఈ ఘటనలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. అతి వేగంతో కుశాల్‌ కారుని నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో మెండిస్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, అరెస్ట్‌ చేశారు. రేపు అతడిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచనున్నారు. కాగా శ్రీలంక క్రికెట్‌ జుట్టులో కొనసాగుతున్న కుశాల్‌ ఇప్పటివరకు 76 వన్డేల్లో 2,167 పరుగులు.. 44 టెస్టుల్లో 2,995 పరుగులు.. 26 టీ20ల్లో 484 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే శ్రీలంక టీమ్‌కి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వెంటాడుతుండగా.. కుశాల్‌ అరెస్ట్‌తో మరో షాక్‌ తగిలినట్లైంది.