అభిమానం హద్దులు దాటితే వివాదాలేనా.. ఫుట్‌బాల్ మ్యాచ్ మైదానంలో ఘోర ప్రమాదం.. తొక్కిసలాటలో 56 మంది మృతి

ఆఫ్రికా దేశం సౌత్ గినియాలోని రెండో అతిపెద్ద నగరంలో జరుగుతున్న పుట్ మ్యాచ్‌లో ఇరు జట్ల అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. సుమారు 56 మంది మరణించారు. ఈ ప్రమాదంపై దేశ సమాచార శాఖ మంత్రి దర్యాప్తునకు ఆదేశించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అభిమానం హద్దులు దాటితే వివాదాలేనా.. ఫుట్‌బాల్ మ్యాచ్  మైదానంలో ఘోర ప్రమాదం.. తొక్కిసలాటలో 56 మంది మృతి
Football Match ClashImage Credit source: X.com
Follow us
Surya Kala

|

Updated on: Dec 03, 2024 | 8:39 AM

ఫుట్‌బాల్ మైదానం నుంచి భయంకరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. ఆఫ్రికా దేశం సౌత్ గినియాలో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భారీ సంఖ్యలో ప్రజలు మరణించారు. నివేదికల ప్రకారం దక్షిణ గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన న్జెరాకోర్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్ టోర్నమెంట్ మ్యాచ్ సందర్భంగా రెండు జట్ల అభిమానుల మధ్య గొడవ మొదలై.. అది భయంకరమైన ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణ వలన స్టేడియంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘర్షణ,ఆ తర్వాత జరిగిన తొక్కిసలాట కారణంగా 56 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకు 56 మంది మరణించారని.. ఇంకా డజన్ల కొద్దీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని సౌత్ గినియా ప్రభుత్వం తెలియజేసింది. ఈ వివాదంపై దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేసింది. ఫుట్‌బాల్ ఇరు జట్ల అభిమానులు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. కొద్దిసేపటికే ఈ వివాదం చినుకు చినుకు గాలి వాన అయినట్లు.. పరిస్థితి అదుపు తప్పింది. దీంతో మైదానంలో తొక్కిసలాట జరిగింది. దీంతో స్టేడియంలో ఉన్నవారు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగులు తీయడం ప్రారంభించారు. అప్పుడు తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై దేశ కమ్యూనికేషన్ల మంత్రి మాట్లాడుతూ.. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. అంతేకాదు ఘర్షణకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గినియాలో ఇద్దరు సాకర్ టీమ్ అభిమానుల మధ్య జరిగిన పోటీలో 100 మంది మరణించారు #సాకర్ #గినియా @Mrgunsngear pic.twitter.com/GJlImuQsFZ

ఇవి కూడా చదవండి

— ది గ్లోబల్ సౌత్ పోస్ట్ (@INdEptHGlobal) డిసెంబర్ 2, 2024

రిఫరీ నిర్ణయంపై రచ్చ, తొక్కిసలాట

మీడియా నివేదికల ప్రకారం దేశ సైనిక నియంత.. తాత్కాలిక అధ్యక్షుడు మామాడి డుంబోయా గౌరవార్థం నిర్వహించిన టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. లెబా, ఎన్జెరాకోర్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు జట్ల మధ్య మొదలైన వివాదం కొంచెం సమయంలోనే అభిమానుల వరకు చేరి పోరు మొదలైంది. రెండు జట్ల భిమానులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం ప్రారంభించారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు టియర్ గ్యాస్ బుల్లెట్లను ప్రయోగించారని, ఆ తర్వాత గందరగోళం నెలకొందని నివేదికల్లో పేర్కొంది.

హెచ్చరిక గ్రాఫిక్ V: #Guinea లో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ b/n ప్రత్యర్థి అభిమానులలో ఆదివారం నాడు ఎంత మంది మరణించారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు . అయితే స్థానికులు ఆ సంఖ్య 100కి పైగానే ఉందని చెబుతున్నారు. SMలో ప్రసారమవుతున్న చిత్రాలు & వీడియోలు ఆసుపత్రిలో అనేక మృతదేహాలను చూపించాయి. అధికారులు శాంతించాలని పిలుపునిచ్చారు. #ఫుట్‌బాల్ pic.twitter.com/8E3tvSDUov

— బెయిలర్ జల్లో (@baillorjah) డిసెంబర్ 2, 2024

మృతుల్లో ఎక్కువ మంది చిన్న పిల్లలే

చాలా మంది అభిమానులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు గ్రౌండ్ వాల్ ఎక్కేందుకు ప్రయత్నించగా.. మరికొందరు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం కనిపించింది. ఈ తొక్కిసలాటలో పలువురు అభిమానులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలు లేదా మైనర్ అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట సమయంలో గుంపులో చిక్కుకోవడంతో వీరు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇందులో చాలా మంది మృతదేహాలు , గాయపడిన అభిమానులు మైదానంలో పడి ఉన్నారు. చాలా మృతదేహాలు కూడా ఆసుపత్రిలో చెల్లాచెదురుగా ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..