సౌతాఫ్రికా క్రికెటర్‌కి కరోనా పాజిటివ్.. కండీషన్ సీరియస్

సౌతాఫ్రికా క్రికెటర్‌కి కరోనా పాజిటివ్.. కండీషన్ సీరియస్

సౌతాఫ్రికా క్రికెటర్‌ సోలో న్వ్కేని‌కి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. గత ఏడాదికాలంగా గుల్లెయిన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్)తో ఇబ్బందిప‌డుతోన్న‌ ఈ 25 ఏళ్ల ఆల్‌రౌండర్‌ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో టెస్టులు చెయ్య‌గా కరోనా సోకినట్లు డాక్ట‌ర్లు గుర్తించారు. 2012లో సౌతాఫ్రికా అండర్-19 జట్టులో నిలకడగా ఆడి వెలుగులోకి వచ్చిన సోలో న్వ్కేని‌ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనూ అదే ఆట‌తీరును కొనసాగించాడు. కాగా ఇటీవల స్కాట్లాండ్‌ క్రికెటర్ మజిద్ హక్‌‌ కరోనా మ‌హమ్మారి బారినపడగా.. పాకిస్థాన్ ఆట‌గాడు […]

Ram Naramaneni

|

May 08, 2020 | 4:21 PM

సౌతాఫ్రికా క్రికెటర్‌ సోలో న్వ్కేని‌కి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. గత ఏడాదికాలంగా గుల్లెయిన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్)తో ఇబ్బందిప‌డుతోన్న‌ ఈ 25 ఏళ్ల ఆల్‌రౌండర్‌ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో టెస్టులు చెయ్య‌గా కరోనా సోకినట్లు డాక్ట‌ర్లు గుర్తించారు. 2012లో సౌతాఫ్రికా అండర్-19 జట్టులో నిలకడగా ఆడి వెలుగులోకి వచ్చిన సోలో న్వ్కేని‌ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనూ అదే ఆట‌తీరును కొనసాగించాడు.

కాగా ఇటీవల స్కాట్లాండ్‌ క్రికెటర్ మజిద్ హక్‌‌ కరోనా మ‌హమ్మారి బారినపడగా.. పాకిస్థాన్ ఆట‌గాడు జాఫర్ సర్ఫరాజ్‌‌‌ కరోనా సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. దీంతో.. కరోనా సోకిన మూడో క్రికెటర్‌గా సోలో న్వ్కేని నిలిచాడు. ‘‘వ‌న్ ఇయ‌ర్ నుంచి గుల్లెయిన్ బార్ సిండ్రోమ్‌తో నేను పోరాటం చేస్తున్నాను. దాని నుంచి నేను ఇంకా సగం కూడా కోలుకోకుండానే ఇటీవల నాకు టీబీ వచ్చింది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే లివర్, కిడ్నీ ప‌నితీరు మానేశాయి. దాంతో నేను కరోనా వైరస్ ప‌రీక్ష‌ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఇలా ఎందుకు అన్ని ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా దాడిచేశాయో..? నాకు అర్థం కావడం లేదు’’ అని సోలో న్వ్కేని‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

నిజానికి సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మార్చి మూడో వారం వరకూ ఇండియాలోనే ఉంది. ఇక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు వచ్చిన సఫారీ జ‌ట్టు.. కరోనా వైరస్ కారణంగా సిరీస్ మధ్యలోనే క్యాన్సిల్ అవ్వ‌డంతో కోల్‌కతా నుంచి దుబాయ్‌కి.. అక్కడి నుంచి సౌతాఫ్రికాకు వెళ్లింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu