టీమిండియాకు బౌలింగ్ కోచ్​గా పనిచేస్తా..చాకుల్లాంటి పేస‌ర్ల‌ను త‌యారుచేస్తా…

టీమిండియాకు బౌలింగ్ కోచ్​గా పనిచేస్తా..చాకుల్లాంటి పేస‌ర్ల‌ను త‌యారుచేస్తా...

ఫ్యూచ‌ర్ లో ఛాన్స్ వ‌స్తే టీమిండియా బౌలింగ్ కోచ్​గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. దూకుడైన, వేగవంతమైన పేసర్లను తాను తయారచేయగలన‌ని ధీమాగా చెప్ప‌తున్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్త‌ర్ ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఇండియా బౌలింగ్ కేట‌గిరీలో వ‌ర్క్ చేసే అవకాశమొస్తే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు స్పందించిన అక్తర్.. “త‌ప్ప‌కుండా పనిచేస్తాను. నా జ్ఞానాన్ని, ఆలోచనల్ని యంగ్ ప్లేయ‌ర్స్ తో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. […]

Ram Naramaneni

|

May 05, 2020 | 3:49 PM

ఫ్యూచ‌ర్ లో ఛాన్స్ వ‌స్తే టీమిండియా బౌలింగ్ కోచ్​గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. దూకుడైన, వేగవంతమైన పేసర్లను తాను తయారచేయగలన‌ని ధీమాగా చెప్ప‌తున్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్త‌ర్ ఈ విషయాన్ని పంచుకున్నాడు.

ఇండియా బౌలింగ్ కేట‌గిరీలో వ‌ర్క్ చేసే అవకాశమొస్తే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు స్పందించిన అక్తర్.. “త‌ప్ప‌కుండా పనిచేస్తాను. నా జ్ఞానాన్ని, ఆలోచనల్ని యంగ్ ప్లేయ‌ర్స్ తో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. దూకుడుతో వేగంగా బంతులు విస‌రగ‌ల‌ పేసర్లను తయారు చేస్తా. అవ‌కాశం వస్తే ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​కు బౌలింగ్ కోచింగ్ ఇస్తాను” అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.

అలానే క్రికెట్ గాడ్ సచిన్, తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పిన అక్తర్.. తనకు అప్పట్లోనే భారత్​లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని అన్నాడు. కాగా ఇండియాపై ఎప్పుడూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే అక్త‌ర్..ఇటీవ‌ల క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల విషయంలో ప్ర‌ధాని మోదీని కూడా పొగిడిన విష‌యం తెలిసిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu