ఐసీసీకి బీసీసీఐ ఘాటు లేఖ

న్యూఢిల్లీ: ఐసీసీకి బీసీసీఐ ఘాటు లేఖ రాసింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న దేశాలను తక్షణమే తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించాలని ఐసీసీని డిమాండ్ చేసింది. పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించే ఈ డిమాండ్ చేసింది. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ ఈ లేఖ రాశారు. ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై తమకు భద్రతాపరంగా అనుమానాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, అంపైర్లు, ఇతర సిబ్బంది భద్రతపై సందేహం వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లకు, అధికారులకు, […]

ఐసీసీకి బీసీసీఐ ఘాటు లేఖ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 8:13 PM

న్యూఢిల్లీ: ఐసీసీకి బీసీసీఐ ఘాటు లేఖ రాసింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న దేశాలను తక్షణమే తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించాలని ఐసీసీని డిమాండ్ చేసింది. పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించే ఈ డిమాండ్ చేసింది. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ ఈ లేఖ రాశారు.

ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై తమకు భద్రతాపరంగా అనుమానాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, అంపైర్లు, ఇతర సిబ్బంది భద్రతపై సందేహం వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లకు, అధికారులకు, అభిమానులకు వరల్డ్ కప్‌లో ఎక్కువ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పుల్వామా దాడి ఘటనను యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా అనేక దేశాలు తీవ్రంగా ఖండిచాయని జోహ్రీ లేఖలో పేర్కొన్నారు.