Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో అవని లేఖర అరుదైన ఘనత.. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌ చేసి అభినందనలు

|

Sep 02, 2024 | 6:03 PM

ప్యారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌ 2024లో భారత మహిళా షూటర్‌ అవని లేఖర అదరగొట్టింది. మహిళా షూటింగ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. అవని సాధించిన విజయంపై యావత్‌ భారతం మురిసింది. ఇక ప్రధాని మోదీ కూడా అభినందించారు. సోమవారం అవనికి స్వయంగా ఫోన్‌ చేసి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో ఆమె అద్భుతమైన ఆటతీరును కనబరిచిందని కొనియాడారు..

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో అవని లేఖర అరుదైన ఘనత.. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌ చేసి అభినందనలు
PM Modi congratulated Avani Lekhara
Follow us on

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 2: ప్యారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌ 2024లో భారత మహిళా షూటర్‌ అవని లేఖర అదరగొట్టింది. మహిళా షూటింగ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. అవని సాధించిన విజయంపై యావత్‌ భారతం మురిసింది. ఇక ప్రధాని మోదీ కూడా అభినందించారు. సోమవారం అవనికి స్వయంగా ఫోన్‌ చేసి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో ఆమె అద్భుతమైన ఆటతీరును కనబరిచిందని కొనియాడారు. లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచేలా ఆమె కనబరచిన అంకితభావం, పట్టుదలకు తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. తదుపరి ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా పారాలింపిక్స్‌లో R2 మహిళల 10M ఎయిర్ రైఫిల్ SH1 ఈవెంట్‌లో అవని స్వర్ణం సాధించింది. 2020 పారాలింపిక్స్‌లో ఓ స్వర్ణం, మరో కాంస్యం సాధించింది. ఇలా మొత్తం 3 పారాలింపిక్ పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.

అవని లేఖర 2001 నవరంబర్‌ 8వ తేదీన రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో జన్మించింది. 11 ఏళ్ల యవసులో కారు ప్రమాదం కారణంగా అప్పటి నుంచి వీల్‌ చైర్‌కే పరిమితమైంది. తండ్రి ప్రోత్సాహంతో షూటింగ్‌ అకాడమీలో చేరిన ఆమె 2015లో నేషనల్ షాంపియన్‌షిప్‌లో పాల్గొంది. నాటి నుంచి వెనక్కితిరిగిందే లేదు. అయితే ఈ ఏడాది పారిస్‌ పారాలింపిక్స్‌ ప్రారంభానికి సరిగ్గా 5 నెలల ముందు అవనికి గాల్‌బ్లాడర్‌ సర్జరీ జరిగింది. అయినప్పటికీ త్వరగా కోలుకుని రెండోసారి పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించింది.

 

ఇవి కూడా చదవండి

కాగా ఇప్పటి వరకూ పారాలింపిక్స్‌లో భారత్‌ 8 పతకాలు సాధించింది. ఈ రోజు పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌56లో యోగేశ్ కతునియా 42.22 మీటర్లు విసిరి రజతం దక్కించుకున్నాడు. యోగేశ్ పతకం గెలవడంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. యోగేశ్‌కు పారాలింపిక్స్‌లో ఇది రెండో పతకం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.