PV Sindhu: తెలుగు తేజంపై ప్రధాని మోడీ ప్రశంసలు.. భావితరాలకు స్ఫూర్తిదాయకమంటూ..
స్విస్ ఓపెన్ టైటిల్ గెల్చుకుని చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధు (PV Sindhu)కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) అభినందనలు తెలిపారు.
స్విస్ ఓపెన్ టైటిల్ గెల్చుకుని చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధు (PV Sindhu)కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) అభినందనలు తెలిపారు. ఆమె విజయాలు భారత యువతకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు మోడీ. ‘స్విస్ ఓపెన్ గెలిచినందుకు పీవీ సింధుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలు భారత యువతకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. మీరు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి. మీ ప్రయత్నాలకు శుభాకాంక్షలు’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు ప్రధాని. అలాగే కేంద్ర న్యాయశాఖామంత్రి కిరణ్ రిజిజు బ్యాడ్మింటన్ క్వీన్‌ను అభినందించారు. ‘ స్విన్ ఓపెన్ గెల్చినందుకు కంగ్రాట్స్.. నువ్వు నిజమైన ఛాంపియన్ అని మరోసారి నిరూపించావు’ అని స్టార్ షట్లర్‌పై ప్రశంసలు కురిపించారు. వీరితో పాటు మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌లు కూడా సింధును అభినందించారు.
కాగా స్విట్జర్లాండ్ రాజధాని బాసెల్ వేదికగా జరిగిన స్విస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో థాయిల్యాండ్ కు చెందిన బుసానన్‌ను 21-16, 21-8 తేడాతో మట్టి కరిపించింది సింధు. తొలి గేమ్ నుంచే ప్రత్యర్థిపై పైచేయి సాధించిన సింధు కేవలం 49 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించడం విశేషం. తద్వారా ఈ ఏడాది రెండో సూపర్-300 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యాడ్మింటన్ క్వీన్. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలోనూ సింధు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా స్విస్ ఓపెన్ టోర్నీలో సింధు విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. గతేడాది టోర్నీలో ఫైనల్ వరకు దూసుకొచ్చిన ఈ హైదరాబాదీ షట్లర్ తుది పోరులో కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది.
Congratulations to @Pvsindhu1 on winning the Swiss Open 2022. Her accomplishments inspire the youth of India. Best wishes to her for her future endeavours.
— Narendra Modi (@narendramodi) March 27, 2022
Also Read:BJP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఏపీ, తెలంగాణల్లో యూపీ ఫార్ములా..
Yadadri: యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం.. కొన్నిగంటల్లో లక్ష్మీనరసింహస్వామి దర్శనం..
Stealth Omicron: సోమవారం నుంచి మళ్లీ లాక్‌డౌన్! మహమ్మారి చావులు ఓవైపు.. ఆకలి కేకలు మరోవైపు!