Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ అప్పీల్‌పై తీర్పు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే? వెండిపై కొనసాగుతోన్న ఉత్కంఠ

మహిళల 50 కిలోల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ మ్యాచ్‌కు ముందు అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ భారత మహిళా రెజ్లర్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో అప్పీల్ దాఖలు చేసింది. నిజానికి వినేష్ అప్పీలుపై శనివారం (ఆగస్టు 10) తీర్పు రావాల్సి ఉంది. కానీ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ తాత్కాలిక విభాగం అధ్యక్షులు ఈ అప్పీల్ పై తీర్పును వాయిదా వేశారు.

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ అప్పీల్‌పై తీర్పు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే? వెండిపై కొనసాగుతోన్న ఉత్కంఠ
Vinesh Phogat
Follow us

|

Updated on: Aug 10, 2024 | 10:33 PM

పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ ‘వెండి’ పతకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మహిళల 50 కిలోల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ మ్యాచ్‌కు ముందు అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ భారత మహిళా రెజ్లర్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో అప్పీల్ దాఖలు చేసింది. నిజానికి వినేష్ అప్పీలుపై శనివారం (ఆగస్టు 10) తీర్పు రావాల్సి ఉంది. కానీ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ తాత్కాలిక విభాగం అధ్యక్షులు ఈ అప్పీల్ పై తీర్పును వాయిదా వేశారు. క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పును ఆదివారం (ఆగస్టు 11)కు వాయిదా వేసినట్లు ప్రకటించింది. ఈ కేసులో తీర్పు కోసం గడువు పదే పదే వాయిదా పడుతుండడంతో, ఈ కేసు చాలా సీరియస్‌గా మారిందని మనం గ్రహించవచ్చు. వాస్తవానికి క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు లో ఏదైనా అప్పీల్ ఉంటే, దానికి తీర్పు ఇవ్వడానికి 24 గంటల సమయం ఇవ్వబడుతుంది. అయితే వినేష్ ఫోగట్ విషయంలో మాత్రం జాప్యం జరుగుతుంది. సీఏఎస్ అడ్ హాక్ సెక్షన్ చైర్మన్ కమిటీ తీర్పు వెలువరించేందుకు గడువును పొడిగించారు. దీని ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు కమిటీ తన నిర్ణయాన్ని వెల్లడించవచ్చని సమాచారం.

శుక్రవారం సాయంత్రం 3 గంటలకు పైగా క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు లో వినేష్ ఫోగట్ పిటిషన్‌పై విచారణ జరిగింది. వాస్తవానికి వినేష్ ఫోగట్ కూడా ఈ విచారణకు హాజరైంది. వినేష్ కోర్టు ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేసి ఉమ్మడిగా రజత పతకం ఇవ్వాలని అభ్యర్థించింది. సెమీ-ఫైనల్స్‌లో వినేష్ ఫోగట్ గెలిచే వరకు ఆమె బరువు నిర్ణీత పరిమితిలో ఉంది. కాబట్టి ప్రముఖ సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా కనీసం రజత పతకమైనా ఇవ్వాలని సీఏఎస్‌లో వినేష్‌కు అనుకూలంగా వాదించారు. అలాగే ఈ కేసు నిర్ణయం వినేష్‌కు అనుకూలంగా వస్తుందని భారత ఒలింపిక్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. వినేష్‌కు అనుకూలంగా తీర్పు వస్తే భారత్ ఖాతాలో మరో రజత పతకం చేరడం ఖాయం.

ఇవి కూడా చదవండి

ఆదివారం తుది తీర్పు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..