Paris Olympics: వారానికే తేలిపోయిన ఒలంపిక్ మెడల్ రంగు.. అథ్లెట్‌ అసంతృప్తి

పారిస్‌ ఒలంపిక్స్‌కు సంబంధించి వరస వివాదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే.. పారిస్‌లో వసతులపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఏకంగా ఒలంపిక్ పతకం వారానికే రంగుపోయిందంటూ అమెరికా అథ్లెట్‌ ఆరోపించడం సంచలనంగా మారింది.

Paris Olympics: వారానికే తేలిపోయిన ఒలంపిక్ మెడల్ రంగు.. అథ్లెట్‌ అసంతృప్తి
Olympic Medal
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 10, 2024 | 8:02 PM

ప్రస్తుతం పారిస్‌ వేదికగా ఒలంపిక్ క్రీడల సంబంరం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పథకాలు సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. పట్టుదలతో పోరాడి ప్రైజ్‌లు సొంతం చేసుకుంటున్నారు. కొందరు బంగారు పతకాలతో ప్రపంచ చాంపియన్‌లుగా నిలుస్తుంటే.. మరికొందరు.. సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌తో సాధిస్తున్నారు. పతకాలు గెలిచిన క్రీడాకారులు, ఆయా దేశాలు పెద్దయెత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. ఒలంపిక్స్‌ లాంటి క్రీడల్లో గెలిచిన పతకాలను అథ్లెట్స్‌ ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అయితే.. ఒలంపిక్‌ పతకం గెలుచుకున్న అమెరికాకు చెందిన ఓ అథ్లెట్‌కు చేదు అనుభవం ఎదురైంది. పారిస్‌ ఒలంపిక్స్‌లో అమెరికా స్కేటర్‌ నిజాహ్యూస్టన్‌ సాధించిన కాంస్యం వారం రోజులకే రంగు పోయిందంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ఒలంపిక్స్‌ పతకాల క్వాలిటీపై ప్రశ్నించడం వివాదాస్పదమవుతోంది. పతకం రంగు మారడం సదరు అమెరికా క్రీడా కారుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పారిస్‌ ఒలంపిక్స్‌లో గెలిచిన మెడల్స్‌ నాణ్యంగా లేవని అమెరికా అథ్లెట్‌ ఆరోపించాడు. వారానికే పతకం గరుకుగా మారిపోయి.. ముందు భాగంలో కలర్‌ చేంజ్‌ అయిందని.. పతకాన్ని చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్లి వచ్చినట్లు ఉందని కామెంట్‌ చేశాడు. అయితే.. పతకాల నాణ్యత పెంచితే బాగుంటుందని సూచించాడు. ఇక.. గతవారం జరిగిన స్ట్రీట్‌ స్కేట్‌బోర్డింగ్‌లో అమెరికా స్కేటర్‌ నిజాహ్యూస్టన్‌ కాంస్యం గెలుచుకున్నాడు. అటు.. ఆయన ఆరోపణలపై ఒలంపిక్స్‌ ప్రతినిధులు స్పందించారు. అమెరికా అథ్లెట్‌ ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని.. దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలు చేపట్టామని తెలిపారు. డ్యామేజ్‌ అయిన మెడల్స్‌ స్థానంలో కొత్త వాటిని ఇచ్చే అంశాన్ని పరిశీస్తున్నామని చెప్పారు ఒలంపిక్స్‌ ప్రతినిధులు.

View this post on Instagram

A post shared by JAH (@nyjah)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..