Women’s Hockey World Cup: నేడు గెలుపే లక్ష్యంగా చైనాతో తలపడనున్న భారత అమ్మాయిలు.. గెలిస్తే నేరుగా క్వార్టర్‌ఫైనల్‌‌లోకి ఎంట్రీ

|

Jul 05, 2022 | 8:04 AM

నేడు చైనా జట్టుతో తలపడుతున్న భారత్ .. ఫామ్, ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే.. భారత మహిళల జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.

Women’s Hockey World Cup: నేడు గెలుపే లక్ష్యంగా చైనాతో తలపడనున్న భారత అమ్మాయిలు.. గెలిస్తే నేరుగా క్వార్టర్‌ఫైనల్‌‌లోకి ఎంట్రీ
Women's Hockey World Cup
Follow us on

Women’s Hockey World Cup: మహిళల హాకీ ప్రపంచకప్‌లో గెలుపే లక్ష్యంగా నేడు భారత్‌ బరిలోకి దిగుతోంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఫేవరెట్‌ జట్టుగా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ను 1-1 స్కోర్ తో భారత్ డ్రాగా ముగించింది. దీంతో మన అమ్మాయిలు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌లో చోటు సంపాదించుకోవాలంటే.. ఈరోజు జరిగే మ్యాచ్ లో  తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈరోజు భారత్ .. చైనా తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ తమ అటాకింగ్ గేమ్‌తో పాటు మహిళల హాకీ ప్రపంచ కప్‌లో మొదటి విజయాన్ని నమోదు చేస్తుందని కోచ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు,

ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేతలైన ఇంగ్లండ్‌తో తలపడి.. 1-1 తో డ్రాగా ముగించారు.    గ్రూప్‌-బిలో భాగంగా ఇండియా-ఇంగ్లండ్‌ జట్ల జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్, గోల్‌కీపర్ సవితా పునియా నేతృత్వంలో భారత అమ్మాయిలు అద్భుతమైన క్రీడాప్రతిభను ప్రదర్శనను ప్రదర్శించారు. వైస్-కెప్టెన్ దీప్ గ్రేస్ ఎక్కా, నిక్కీ ప్రధాన్, గుర్జిత్ కౌర్ , ఉదిత వంటి వారు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు, మొత్తం మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఒక్క పెనాల్టీ కార్నర్‌ను కూడా ఇవ్వక పోవడం విశేషం.

అయితే ఈ మ్యాచ్‌లో గుర్జిత్ కౌర్ బృదం ఆరు పెనాల్టీ కార్నర్‌లు పొందినప్పటికీ వాటిని గోల్స్ గా  చేయలేకపోయింది. దీంతో పెనాల్టీ కార్నర్‌లో గోల్‌ చేయకపోవడాన్ని వైఫల్యంగా పరిగణిస్తామని కోచ్ చెప్పారు. అంతేకాదు  నేడు  చైనాతో తలపడే సమయంలో ఈ తప్పును సరిదిద్దాలి. అప్పుడే గెలుపు ఖాయం’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

నేడు చైనా జట్టుతో తలపడుతున్న భారత్ .. ఫామ్,  ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే.. భారత మహిళల జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇప్పటివరకు భారత్..  చైనాతో 21 సార్లు తలపడింది. భారత్‌ 11 సార్లు గెలవగా.. చైనా 9 సార్లు విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఈరోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది.  ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–3, స్టార్‌ స్పోర్ట్స్‌ ఫస్ట్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..