Diwali 2021: దీపావళి వేడుకలో పీవీ సింధు డ్యాన్స్.. వైరల్ అయిన వీడియో..
స్టార్ షెట్లర్ పీవీ సింధు దీపావళిని చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఆమె దీపావళి వేడుకలో డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను సింధు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు...
స్టార్ షెట్లర్ పీవీ సింధు దీపావళిని చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఆమె దీపావళి వేడుకలో డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను సింధు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఒకే రోజులో 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 26 ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ ‘లవ్ న్వాంటిటి’ పాటుకు నృత్యం చేశారు.
View this post on Instagram
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులో మీదుగా పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు.. అంతకు ముందు జరిగిన రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెల్చుకుంది. ఇక 2019లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ హైదరాబాదీ స్టార్ అంతకుముందు వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో రెండు కాంస్యాలు, రెండు రజతాలు సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఎక్కువ పతకాలు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
తన అత్యద్భుత ఆటతీరుకు గుర్తింపుగా ఇప్పటికే ఎన్నో పురస్కారాలు అందుకుంది సింధు. 2015 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఈ బ్యాడ్మింట్ క్వీన్ 2017లోనే పద్మభూషణ్‌కు నామినేట్ అయ్యింది. అయితే తుది జాబితాలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. తాజాగా ఆ పురస్కారం కూడా ఆమె కీర్తి కిరీటంలో చేరిపోయింది. కాగా భారత ప్రభుత్వ మూడో అత్యున్నత పురస్కారం ‘పద్మభూషణ్’ అందుకోవడంపై సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అవార్డు అందుకున్న ఆమె “ఇది గర్వించదగిన క్షణం. నాకు ఈ అవార్డును అందించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రకమైన అవార్డులు మాకు చాలా ప్రోత్సాహాన్ని, మద్దతును ఇస్తాయి. రాబోయే కాలంలో మరింత మెరుగ్గా రాణిస్తానని”పీవీ సింధు అన్నారు. ‘లవ్ న్వాంటిటి’ ఇష్టపడిన అతికొద్ది మంది ప్రముఖులలో సింధు కూడా ఒకరు. నైజీరియన్ గాయకుడు CKay పాడిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ గ్లోబల్ చార్ట్‌లో నంబర్ వన్ పాటగా ఉంది. ఈ పాటకు యూట్యూబ్‌లో 1.1 కోట్లకు పైగా వీక్షకులు ఉన్నారు.
Read Also.. Cricket: 24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. 1998లో చివరి పర్యటన..