Watch: అర్జెంటీనాలో క్రీడాకారుల బస్సు మీదకు దూకిన అభిమానులు.. వెంటనే మెస్సీ జట్టును ఎయిర్‌లిఫ్ట్‌ చేసిన అధికారులు..

అర్జెంటీనాలో సంబరాలు హింసాత్మకంగా మారాయి. సంబరాల్లో రెచ్చిపోయిన అల్లరి మూకలు రచ్చ రచ్చ చేశాయి. క్రీడాకారుల బస్సు మీదకు దూకడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు. మెస్సీ జట్టును ఎయిర్‌లిఫ్ట్‌ చేశారు.

Watch: అర్జెంటీనాలో క్రీడాకారుల బస్సు మీదకు దూకిన అభిమానులు.. వెంటనే మెస్సీ జట్టును ఎయిర్‌లిఫ్ట్‌ చేసిన అధికారులు..
Messi And Co Airlifted
Follow us

|

Updated on: Dec 21, 2022 | 4:49 PM

ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా ట్రోఫీని కైవసం చేసుకుంది. అప్పటి నుంచి అర్జెంటీనాలో సంబరాలు మిన్నంటాయి. రోడ్డుపై ఉన్న లియోనెల్ మెస్సీతో సహా మొత్తం జట్టును చూడటానికి ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. జట్టు వారి విజయాన్ని ప్రజలతో జరుపుకోవడానికి బ్యూనస్ ఎయిర్స్ వీధుల్లోకి వచ్చింది, కానీ విషయాలు చాలా నియంత్రణలో లేవు, మెస్సీతో పాటు మొత్తం జట్టును హెలికాప్టర్ సహాయంతో హఠాత్తుగా ఖాళీ చేయవలసి వచ్చింది.

ఫిఫా వరల్డ్‌కప్‌ గెలిచి అర్జెంటీనాలో అడుగుపెట్టిన మెస్సీ జట్టుకు అఖండ స్వాగతం లభించింది. ఫుట్ బాల్ పిచ్చి దేశం పూర్తిగా సంబరాల్లో మునిగిపోయింది. 40 లక్షల మందికి పైగా ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. రోడ్డుపై కాలు మోపేందుకు కూడా స్థలం లేని పరిస్థితి నెలకొంది.

మెస్సీని చూసేందుకు అభిమానులు తహతహలాడారు 

వేడుకకు హాజరైన ప్రతి ఒక్క అభిమాని మెస్సీని ఒక్కసారి చూసేందుకు తహతహలాడుతున్నారు. మెస్సీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడే రీతిలో కొందరు వ్యక్తులు బస్సును చుట్టుముట్టారు. కొందరు అభిమానులు బస్సు ఎక్కేందుకు కూడా ప్రయత్నించారు. ఇదంతా చూస్తుంటే మెస్సీని బస్సు నుంచి దింపాలని యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. హెలికాప్టర్ సాయంతో మెస్సీని, అతని సహచరులను బస్సులో నుంచి బయటకు తీసి మరో ప్రదేశానికి తరలించారు.

ఫ్లైఓవర్‌ మీద నుంచి బస్సులోకి దూకేసిన అభిమాని..

లక్షలాది మంది అభిమానులు రాజధాని బ్యూనొస్‌ ఐరెస్‌కి తరలివచ్చారు. దీంతో రోడ్డు, ఫ్లైఓవర్లు వాటికి రెండు వైపులా ఉన్న బిల్డింగులు ఇసుకేసినా రాలనంత మంది వచ్చారు. దీంతో చాంపియన్‌ జట్టుకు అపూర్వ స్వాగతం లభించింది. అయితే క్యాపిటల్‌ సిటీలో అంతకంతకూ జనం గుమిగూడడంతో పరిస్థితులు మారాయి. కొందరు లీటర్లకు లీటర్లు బీర్లు తాగి నానా రచ్చ చేశారు.

రోడ్లపై బాటిళ్లు పగలగొడుతూ బీభత్సం సృష్టించారు. ఈలోపే ప్లేయర్లు ఉన్న బస్సులోకి ఇద్దరు ఫ్లైఓవర్‌ మీద నుంచి దూకేశారు.

దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. వరల్డ్‌ కప్‌ ఊరేగింపును అర్ధంతరంగా ఆపేశారు. హెలీకాఫ్టర్లు తెప్పించి.. జట్టుని ఎయిర్‌లిఫ్ట్‌ చేశారు. టీమ్‌ అర్ధంతరంగా వెళ్లిపోవడం అభిమానులకు నచ్చలేదు. దీంతో పోలీసులపై రాళ్లు, బాటిళ్ల రువ్వడం మొదలుపెట్టారు. రోడ్లపై నానా బీభత్సం సృష్టించారు. అక్కడకు వచ్చిన లక్షలాది మంది ఫ్యాన్స్‌ ఈ అల్లరి మూకల చేష్టలతో వెళ్లిపోయారు. కాని తప్పతాగిన వారు పోలీసులతో గొడవకు దిగారు.

ఫ్రాన్స్‌పై 4-2తో అర్జెంటీనా విజయం 

FIFA వరల్డ్ కప్ 2022 ఫైనల్ డిసెంబర్ 18న అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగింది. ఈ రోజు టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఉత్తేజకరమైన ఫుట్‌బాల్ ఫైనల్స్‌లో ఒకటిగా మారింది. పెనాల్టీ షూటౌట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌ను 4-2తో ఓడించి అర్జెంటీనా జట్టు విశ్వవిజేతగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం