AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hockey World Cup 2023: ప్రజల నుంచి రూ.25 లక్షల విరాళాలు.. భాగమైన ఆటగాళ్లు.. భారత్‌లో ఆడేందుకు నానాకష్టాలు..

Wales Hockey Team: వేల్స్ తమ మొదటి టోర్నమెంట్‌లో క్లిష్టమైన గ్రూప్‌లో చేరింది. గ్రూప్ డిలో చేరింది. ఇక్కడ ఆతిథ్య భారతదేశం, పొరుగున ఉన్న ఇంగ్లాండ్, స్పెయిన్ లాంటి దిగ్గజ జట్లు ఉన్నాయి.

Hockey World Cup 2023: ప్రజల నుంచి రూ.25 లక్షల విరాళాలు.. భాగమైన ఆటగాళ్లు.. భారత్‌లో ఆడేందుకు నానాకష్టాలు..
Mens Wales Hockey Team
Venkata Chari
|

Updated on: Jan 13, 2023 | 1:05 PM

Share

దాదాపు 5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, ప్రపంచంలోని అత్యుత్తమ పురుషుల హాకీ జట్లు టైటిల్ కోసం ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. ఎఫ్‌హెచ్ఐ హాకీ ప్రపంచ కప్ 2023 ఒడిశాలో ఈరోజు అంటే శుక్రవారం, జనవరి 13న ప్రారంభమవుతుంది . ఆతిథ్య భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం వంటి ప్రపంచ హాకీలోని అతిపెద్ద జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఈసారి అందరి దృష్టిని ఆకర్షించడానికి ఒక జట్టు కూడా సిద్ధంగా ఉంది. భారత్‌లో ఆడేందుకు ఆ జట్టు ఎదుర్కొన్న సవాళ్లు చాలా కఠినమైనవి.

ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసేందుకు వేల్స్ హాకీ జట్టు సిద్ధమైంది. ఈ హాకీ స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం 200 మాత్రమే. అదే వేల్స్ జట్టు రాబోయే 15 రోజుల్లో పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తుంది. వారు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ హాకీ స్టేడియంలలో ఒకదానిలో బరిలోకి దిగనున్నారు.

క్రౌడ్ ఫండింగ్ నుంచి ఖర్చులు..

వేల్స్‌ జట్టు ఇక్కడికి చేరుకునే ప్రయాణం అంత సులభం రాలేదు. ఏ ఆటగాడైనా తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటాడు. అయితే వేల్స్‌కు చెందిన ఆటగాళ్ళు తమ జాతీయ జట్టు కోసం ఆడేందుకు ప్రతి సంవత్సరం 1,000 పౌండ్లు అంటే దాదాపు లక్ష రూపాయలు చెల్లించేవారు. ఇదొక్కటే కాదు, ప్రపంచకప్‌లో పాల్గొనడానికి భారతదేశం ప్రయాణం కూడా అంత సులభం కాలేదు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో జరిగే టోర్నమెంట్ కోసం వేల్స్ జట్టు రెండు నగరాల్లో విమానం, వసతి, ఆహారం కోసం క్రౌడ్ ఫండింగ్ (ప్రజల నుంచి సేకరించిన డబ్బు) నుంచి 25,000 పౌండ్లు అంటే సుమారు రూ. 25 లక్షలు సేకరించింది.

క్రీడాకారులు కూడా భాగం..

కోచ్ డేనియల్ న్యూకాంబ్ వేల్స్‌లోని హాకీ స్థితి, జట్టు పోరాటాల గురించి ప్రపంచానికి తెలిపాడు. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, న్యూకాంబ్ ఇంగ్లాండ్‌తో జట్టు ప్రారంభ మ్యాచ్‌కు ముందు, ఆటగాళ్ల ఖర్చులను తగ్గించడంలో క్రౌడ్ ఫండింగ్ ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. ఇందుకు ఆటగాళ్ళు కూడా సహకరిస్తారు. ప్రతి క్రీడాకారుడు వేల్స్ కోసం ఆడే ప్రతి సంవత్సరం £1,000 ఇస్తారు. హాకీ ఇక్కడ ఒక చిన్న గేమ్. వాళ్ల జాతీయ స్టేడియంలో కేవలం 200 మంది మాత్రమే కూర్చోగలరు. ఇది మన దేశంలోని బిర్సా ముండా స్టేడియం కంటే చాలా భిన్నంగా ఉంది. ( బిర్సా ముండా స్టేడియంలో దాదాపు 21,000 మంది ప్రేక్షకులు కూర్చోగలరు).

స్పాన్సర్‌షిప్ నుంచి ఉపశమనం..

అయితే, ఇటీవలి కాలంలో వేల్స్‌కు శుభవార్త కూడా వచ్చింది. ఇందులో జెర్సీ స్పాన్సర్ చాలా ముఖ్యమైనది. కోచ్ మాట్లాడుతూ, “ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం చాలా పరిమితం. కాబట్టి ఆటగాళ్లు కూడా తమవంతు సహాయం చేస్తారు. కానీ, పెద్ద టోర్నమెంట్‌లకు అర్హత సాధించడంలో విజయం లభించడంతో.. మమ్మల్ని ఇక్కడకు ప్రయాణించేలా చేసింది. మా ప్రభుత్వం కూడా నిజంగా సహాయకారిగా ఉంది. మేం ఇప్పుడు షర్ట్ స్పాన్సర్‌ని కలిగి ఉన్నాం. ఇది ఆటగాళ్లపై ఖర్చును తగ్గించిందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

టఫ్ గ్రూపులో వేల్స్ జట్టు..

వేల్స్ తమ మొదటి టోర్నమెంట్‌లో క్లిష్టమైన గ్రూప్‌లో చేరింది. గ్రూప్ డిలో చేరింది. ఇక్కడ ఆతిథ్య భారతదేశం, పొరుగున ఉన్న ఇంగ్లాండ్, స్పెయిన్ లాంటి దిగ్గజ జట్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్ జనవరి 13 శుక్రవారం నాడు ఇంగ్లాండ్‌తో ఆడనుంది. అదే సమయంలో జనవరి 19న భారత్‌తో పోటీపడనుంది. వేల్స్ జట్టు ఖచ్చితంగా ఈ ప్రపంచకప్‌లో కనీసం ఒక్క విజయం అయినా నమోదు చేయాలని భావిస్తుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..