Khel Ratna Award: ఖేల్ రత్న రేసులో గోల్డెన్ బాయ్.. అర్జున అవార్డుకు 35 మంది ఎంపిక.. లిస్టులో ఎవరున్నారంటే?
నీరజ్ చోప్రా, రవి దహియా, పీఆర్ శ్రీజేష్, లోవ్లినా బోర్గోహైతో సహా టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు సిఫార్సు చేశారు. జాతీయ క్రీడా అవార్డుల కమిటీ కూడా 35 మంది అథ్లెట్లను అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది.
Khel Ratna Award: భారత అత్యున్నత క్రీడా పురస్కారం – మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు 11 మంది అథ్లెట్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ బుధవారం సిఫార్సు చేసింది. జావెలిన్‌లో టోక్యో ఒలింపిక్స్ 2020లో చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాతోపాటు ఇతర ఒలింపిక్ పతక విజేతలు – రవి దహియా, పీఆర్ శ్రీజేష్, లోవ్లినా బోర్గోహైల ఈ జాబితాలో ఉన్నారు. సునీల్ ఛెత్రీతో పాటు ప్రముఖ భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు.
టోక్యో ఒలింపిక్స్ 2020తో పాటు టోక్యో పారాలింపిక్స్ 2020లో పలువురు అథ్లెట్లు దేశం గర్వపడేలా చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2021ని భారతదేశానికి ఒక ప్రత్యేక సంవత్సరంగా మలిచారు. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా అవతరించిన భారత పారాలింపియన్ అవనీ లేఖరా కూడా ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైంది. పారాలింపిక్స్ 2020లో ఎఫ్64 పారా జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని గెలుచుకున్న సుమిత్ యాంటిల్ కూడా ఖేల్ రత్నకు సిఫార్సు అయ్యారు. వీరితోపాటు 35 మంది భారత అథ్లెట్లు అర్జున అవార్డుకు సిఫార్సు చేశారు.
ఖేల్ రత్న అవార్డుకు సిఫార్సు చేయబడిన 11 మంది భారతీయ అథ్లెట్లు:
నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్) రవి దహియా (రెజ్లింగ్) పీఆర్ శ్రీజేష్ (హాకీ) లోవ్లినా బోర్గోహై (బాక్సింగ్) సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్) మిథాలీ రాజ్ (క్రికెట్) ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్) సుమిత్ ఆంటిల్ (జావెలిన్) అవని లేఖ (షూటింగ్) కృష్ణా నగర్ (బ్యాడ్మింటన్) ఎం. నర్వాల్ (షూటింగ్)
గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా పిలవగా, ప్రస్తుతం ఈ అవార్డును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లెజెండరీ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో మార్చారు. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ 2020లో హాకీలో భారతదేశం ప్రదర్శన ఆధారంగా భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారంగా మార్చారు.
పురుషుల హాకీ జట్టు 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. మహిళల హాకీ జట్టు సెమీస్‌కు చేరుకోవడం ద్వారా మెగా ఈవెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శనను అందించింది. ఒలింపిక్స్ తర్వాత అథ్లెట్లందరినీ ప్రధాని మోదీ ఆహ్వానించి, శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలిపారు. “విజయం సాధించిన ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. మీరు మేజర్ ధ్యాన్ చంద్‌కు అతిపెద్ద నివాళులర్పించారు. ఇంతటి స్ఫూర్తి పొందిన తర్వాత నేను హాకీని గౌరవించాలనుకుంటున్నాను. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను” అని మోదీ ఆటగాళ్లతో అన్నారు.
Also Read: Lalit Modi: బెట్టింగ్ కంపెనీలు కూడా ఐపీఎల్ జట్టును కొలుగోలు చేయవచ్చు.. లలిత్ మోడీ సంచలన ట్వీట్..
ICC T20 Rankings: పాక్ ఓపెనర్ దెబ్బకు దిగజారిన కోహ్లీ ప్లేస్.. అదే బాటలో కేఎల్ రాహుల్ కూడా..!