Harassment: స్పోర్ట్స్‌ మినిస్టర్‌‌పై కంప్లైంట్‌ ఇచ్చినప్పటి నుంచే బెదిరింపు కాల్స్‌: జూనియర్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌

క్రీడారంగంలో మహిళలపై లైంగిక వేధింపులు గత కొద్ది రోజులుగా కలకలం రేపుతున్నాయి. తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని జూనియర్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌ ఆరోపించారు.

Harassment: స్పోర్ట్స్‌ మినిస్టర్‌‌పై కంప్లైంట్‌ ఇచ్చినప్పటి నుంచే బెదిరింపు కాల్స్‌: జూనియర్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌
Haryana Sports Minister Sandeep Singh

Updated on: Mar 18, 2023 | 11:21 AM

ఇటీవల మహిళా బాక్సర్లు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పారు. తాజాగా హర్యాణా క్రీడాశాఖా మంత్రి సందీప్‌పై లైంగిక వేధింపుల ఇష్యూ కాకరేపుతోంది. మంత్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు జూనియర్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌ గతంలో ఆరోపించారు. తనని లొంగదీసుకోవడం శతవిధాలా ప్రయత్నించిన మంత్రి.. తనపై భౌతిక దాడికి కూడా ప్రయత్నించినట్టు మహిళా కోచ్‌ గతంలో పేర్కొన్నారు. ఐతే తనపై స్పోర్ట్స్‌ మినిస్టర్‌ సందీప్‌ సింగ్‌ వేధింపులకు పాల్పడిన విషయంపై పోలీసు కంప్లైంట్‌ ఇచ్చినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, అతడిని తక్షణమే మంత్రి పదవినుంచి తప్పించాలని జూనియర్‌ అథ్లెట్‌ కోచ్‌ డిమాండ్‌ చేశారు. హరియాణా అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు.

గత రెండు నెలలుగా ఇష్యూ కొనసాగుతున్నా.. కోచ్‌ ఆరోపణల అనంతరం కూడా మంత్రి సందీప్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. అతడిని మంత్రి పదవిలో కొనసాగిస్తున్నారని జూనియర్‌ కోచ్‌ ఆరోపించారు. మంత్రిపై చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు నిష్పక్షిక విచారణ జరపాలని ఆమె డిమాండ్‌ చేశారు.

హరియాణా పోలీసులు తనపట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన కోచ్‌.. ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగిందన్న వివరాలను తనకు అందించాల్సిందిగా చండీఘర్‌ డీజీపీని, సిట్‌ అధికారులను జూనియర్‌ కోచ్‌ రిక్వెస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..