AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sadhguru: యోగా.. కేవలం వ్యాయామం, పోటీపడే ఆట కాదు.. ఓసీఏ నిర్ణయంపై సద్గురు ఆగ్రహం

2026 ఆసియా క్రీడల్లో యోగాని ప్రదర్శన క్రీడగా చేర్చాలన్న ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) నిర్ణయంపై ఆధ్యాత్మిక వేత్త, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఓ పోస్ట్‌ చేశారు. ఈ నిర్ణయంపై సద్గురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది "ఇది అత్యంత నిరాశపరిచే నిర్ణయం" అంటూ ఆయన పేర్కొన్నారు. ఇది యోగా ఉనికినే ప్రమాదంలో పడేస్తుందంటూ విచారం వ్యక్తం చేశారు.

Sadhguru: యోగా.. కేవలం వ్యాయామం, పోటీపడే ఆట కాదు.. ఓసీఏ నిర్ణయంపై సద్గురు ఆగ్రహం
Whatsapp Image 2024 09 10 At 10.08.40 Pm
Venkata Chari
|

Updated on: Sep 10, 2024 | 10:24 PM

Share

Sadhguru: 2026 ఆసియా క్రీడల్లో యోగాని ప్రదర్శన క్రీడగా చేర్చాలన్న ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) నిర్ణయంపై ఆధ్యాత్మిక వేత్త, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఓ పోస్ట్‌ చేశారు. ఈ నిర్ణయంపై సద్గురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది “ఇది అత్యంత నిరాశపరిచే నిర్ణయం” అంటూ ఆయన పేర్కొన్నారు. ఇది యోగా ఉనికినే ప్రమాదంలో పడేస్తుందంటూ విచారం వ్యక్తం చేశారు. యోగా అనేది ఓ పోటీ కాదు. యోగా అనేది స్వీయ-పరిణామం కోసం ఒక శక్తివంతమైన సాధనం. మానవుడిని పరిమిత అవకాశాల నుంచి అపరిమితమైన అవగాహన, జీవిత అనుభవం పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇతరులతో పోటీపడి ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల యోగా శక్తివంతమైన విజ్ఞాన శాస్త్రాన్ని సర్కస్ లాంటి చర్యగా ఒకరితో మరొకరు పోటీ పడేలా చేస్తుందని అన్నారు. యోగా హాస్యాస్పదమైన క్రీడగా మారకుండా చూసుకోవాలని సూచించారు.

అలాగే, యోగా అనేది వ్యక్తుల పరిమితులను అధిగమించడంతోపాటు, జీవితం లోతైన కోణాలను అన్వేషించడంలో సహాయపడుతుందని, ఇది పోటీ ఫ్రేమ్‌వర్క్‌కు అస్సలు సెట్ కాదని ఆయన ఉద్ఘాటించారు.

జపాన్‌లోని నగోయాలో జరగనున్న 2026 ఆసియా క్రీడల్లో యోగాసనాన్ని ప్రదర్శన క్రీడగా చేర్చాలని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) ఇటీవలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సద్గురు తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం జరిగిన 44వ సాధారణ సమావేశంలో ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో యోగాను చేర్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..