AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinesh Phogat: పారిస్‌ ఒలంపిక్స్‌లో రాజకీయం చేశారు.. పీటీ ఉషపై వినేశ్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోశ్ ఫొగాట్.. ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ (IOA), దాని అధ్యక్షురాలు పీటీ ఉషపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. పారిస్‌లో వారి నుంచి తనకు ఏమి మద్దతు లభించిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తనకు మద్దతు తెలిపే విషయంలో ఐవోఏ తీవ్ర జాప్యం కారణం చేసినందునే కాస్‌లో తీర్పు తనకు అనుకూలంగా రాలేదన్నారు.

Vinesh Phogat: పారిస్‌ ఒలంపిక్స్‌లో రాజకీయం చేశారు.. పీటీ ఉషపై వినేశ్ సంచలన వ్యాఖ్యలు
Vinesh Phogat with PT Usha (File Photo)
Janardhan Veluru
|

Updated on: Sep 11, 2024 | 12:44 PM

Share

పారిస్ ఒలంపిక్స్‌లో తృటిలో పతకం చేజారిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నందున.. ఫైనల్‌‌లో ఆడేందుకు అర్హత కోల్పోయిన వినేశ్‌ పతకాన్ని చేజారడం తెలిసిందే. ఫైనల్‌కు ముందు రోజు రాత్రికి రాత్రి బరువు తగ్గే ప్రయత్నంలో ఆమె డీహైడ్రేషన్‌కు గురై ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైనల్‌కు చేరినందున తనకు పతకం రజత పతకం ఇవ్వాలంటూ ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)లో అప్పీల్ చేసుకున్నా ఊరట దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన వినేశ్.. రెజ్లింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలికి.. వెంటనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె చుట్టూనే హర్యానా రాజకీయాలు నడుస్తున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోశ్ ఫొగాట్.. ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ (IOA), దాని అధ్యక్షురాలు పీటీ ఉషపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. పారిస్‌లో వారి నుంచి తనకు ఏమి మద్దతు లభించిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తనకు మద్దతు తెలిపే విషయంలో ఐవోఏ తీవ్ర జాప్యం కారణం చేసినందునే కాస్‌లో తీర్పు తనకు అనుకూలంగా రాలేదన్నారు. పీటీ ఉష ఫొటోల కోసమే తనను పరామర్శించేందుకు వచ్చారని ఆరోపించారు. తన ఆరోగ్యం గురించి ఆమె ఏమీ ఆడగలేదని ఆరోపించారు. రాజకీయాల్లో తెరవెనుక చాలా జరిగినట్లే.. పారిస్‌లో కూడా పెద్ద రాజకీయం చేశారంటూ ఆమె అసహనం వ్యక్తంచేశారు. అందుకే తన గుండె బద్దలయ్యిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. చాలా మంది రెజ్లింగ్‌కు వీడ్కోలు చెప్పొద్దని సలహా ఇచ్చారని.. అయితే అన్ని చోట్లా రాజకీయం ఉందని, తాను ఎందుకు రెజ్లింగ్ కొనసాగించాలని ప్రశ్నించారు.

వినేశ్ ఫొగాట్ ఇంటర్వ్యూ వీడియో..

తనను ఆస్పత్రిలో కలిసిన తర్వాత ఫొటోను పీటీ ఉషా సోషల్ మీడియాలో షేర్ చేయడంపై కూడా వినేశ్ ఫొగాడ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. పీటీ ఉష మేడమ్ తన వద్దకు వచ్చి తనకు చెప్పకుండానే ఫొటోలు దిగారని.. తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపారు.

సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా