PV Sindhu: ‘ఇది గర్వించే విజయం.. రాబోయే క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తి’.. సింధుపై ప్రసంశల జల్లు కురిపించిన ప్రధాని..
PV Sindhu Vs Wang Zhi Yi Singapore Open Badminton 2022 Final: పీవీ సింధు వర్సెస్ వాంగ్ జి యి మధ్య జరిగిన సింగపూర్ ఓపెన్ బ్లాక్‌బస్టర్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో భారత దిగ్గజం ఘన విజయం సాధించింది.
PV Sindhu Vs Wang Zhi Yi Singapore Open Badminton 2022 Final: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చారిత్రాత్మక విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సింధు ఆదివారం సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలిసారి సింగపూర్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన సింధుకు అభినందనలు తెలుపుతూ ప్రధాని ట్వీట్ చేశారు. సింధు మరోసారి తన అసాధారణ క్రీడా ప్రతిభను ప్రదర్శించి విజయాలు సాధించిందంటూ పేర్కొన్నారు. ఇది యావత్ దేశం గర్వించదగ్గ క్షణం. ఆమె విజయం రాబోయే ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశాడు. సింగపూర్ ఓపెన్ 500 ఫైనల్లో చైనా క్రీడాకారిణి జీ యి వాంగ్‌పై 21-9, 11-21, 21-15తో సింధు విజయం సాధించింది. ఈ సీజన్‌లో సింధుకు ఇది మూడో టైటిల్. అంతకుముందు ఆమె రెండు సూపర్ 300 టోర్నమెంట్లు, సయ్యద్ మోడీ, స్విస్ ఓపెన్ గెలిచాడు.
మూడో గేమ్‌లో గట్టి పోటీ..
I congratulate @Pvsindhu1 on winning her first ever Singapore Open title. She has yet again demonstrated her exceptional sporting talent and achieved success. It is a proud moment for the country and will also give inspiration to upcoming players. https://t.co/VS8sSU7xdn
— Narendra Modi (@narendramodi) July 17, 2022
సింగపూర్ ఓపెన్ టైటిల్ మ్యాచ్‌లో సింధు, వాంగ్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. సింధు 21-9తో తొలి గేమ్‌ను సులువుగా కైవసం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో చైనీస్ ప్లేయర్ పునరాగమనం చేసి 11-21తో గేమ్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను సమం చేసింది. ఇక మూడో, చివరి గేమ్‌లో సింధు, వాంగ్ మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఇద్దరి మధ్య జరిగిన సుదీర్ఘ ర్యాలీలో ఒక్కో పాయింట్ చొప్పున గెలిచి డ్రాప్ షాట్‌తో పాయింట్లు సేకరించారు. చివరికి, మాజీ ప్రపంచ ఛాంపియన్ సింధు తన అద్భుతమైన టెక్నిక్‌తో మూడవ గేమ్‌ను గెలుచుకుంది.