Paris Olympics: పాక్ గోల్డెన్ బాయ్‌కి బాహుమతిగా ‘గేదె’నిచ్చిన అత్తింటివారు.. అసలు కారణం ఇదేనంట?

Arshad Nadeem: పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అర్షద్ నదీమ్‌పై అవార్డుల, రివార్డుల వర్షం కురుస్తోంది. ఈ సమయంలో, అతను తన అత్తమామల నుంచి ఒక గేదెను బహుమతిని కూడా అందుకున్నాడు. అర్షద్ నదీమ్‌కు అత్తమామలు గేదెను ఎందుకు ఇచ్చారనే దానికి సమాధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.

Paris Olympics: పాక్ గోల్డెన్ బాయ్‌కి బాహుమతిగా 'గేదె'నిచ్చిన అత్తింటివారు.. అసలు కారణం ఇదేనంట?
Arshad Nadeem
Follow us

|

Updated on: Aug 12, 2024 | 2:20 PM

పారిస్‌ ఒలింపిక్స్‌లో జరిగిన జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో అర్షద్‌ నదీమ్‌ బంగారు పతకం సాధించాడు. బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా అర్షద్ నదీమ్ ఈ క్రీడలో కొత్త ఒలింపిక్ ఛాంపియన్ అయ్యాడు. ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన అర్షద్ పాకిస్థాన్‌కు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అర్షద్‌కు అద్భుతమైన స్వాగతం లభించింది. ఆయన స్వగ్రామానికి వెళ్లినప్పుడు అపూర్వ స్వాగతం లభించింది. ఈ క్రమంలో బంగారు పతకం సాధించినందుకుగానూ అర్షద్ అత్తమామలు ఓ గేదెను బహుమతిగా ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారంట.

అర్షద్ నదీమ్‌కు గేదెను బహుమతిగా ఇచ్చిన అత్తింటివారు..

అర్షద్ నదీమ్ పాకిస్థాన్ చేరకముందే అతడిపై రివార్డుల వర్షం కురిపించారు. చేతనైనంత సాయం చేస్తామని చాలామంది ప్రకటించారు. ఈ క్రమంలో ఎంతోమంది తమ అల్లుడికి కానుకలు ఇస్తుంటే.. మామగారు మాత్రం.. పల్లెటూరి వాతావరణం, సంప్రదాయానికి అనుగుణంగా, అతను తన అల్లుడికి గేదెను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

గ్రామంలో గేదెను బహుమతిగా ఇవ్వడం గౌరవప్రదమైనది – అర్షద్ నదీమ్ మామ..

గేదెను బహుమతిగా ఇచ్చిన కారణాన్ని కూడా అర్షద్ నదీమ్‌ మామ చెప్పుకొచ్చాడు. గేదెను బహుమతిగా ఇవ్వడం తమ గ్రామంలో ఎంతో విలువైనదిగానూ, గౌరవప్రదంగానూ పరిగణిస్తుంటారు. ఆయన మాట్లాడుతూ నదీమ్ తన మూలాల గురించి చాలా గర్వపడుతున్నాడు. ఇంత విజయం సాధించినా తన గ్రామాన్ని వదల్లేదు. అతను ఇప్పటికీ తన తల్లిదండ్రులు, సోదరులతో నివసిస్తున్నాడు.

అర్షద్ నదీమ్ మామగారి ప్రకారం, అతను మా చిన్న అల్లుడు. తనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వీరిలో చిన్న కుమార్తె అయేషాకు నదీమ్‌తో వివాహమైందని తెలిపాడు. తన చిన్న కుమార్తెను నదీమ్‌తో వివాహం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, అతను అప్పట్లో చిన్న ఉద్యోగాలు చేసేవాడని అర్షద్ మామ తెలిపాడు. అయితే, అర్షద్‌కు మొదటి నుంచి జావెలిన్ క్రీడపై చాలా మక్కువ ఉండేదని, పొలాల్లో పనిచేస్తూ జావెలిన్ విసరడం సాధన చేసేవాడంటూ చెప్పుకొచ్చాడు.

ఒలింపిక్ కొత్త ఛాంపియన్‌గా అర్షద్ నదీమ్..

పారిస్‌ ఒలింపిక్స్‌లో అర్షద్‌ నదీమ్‌ 92.97 మీటర్ల జావెలిన్‌ విసిరి బంగారు పతకం సాధించాడు. ఈ గేమ్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

"ఇది మన ప్రభుత్వం" పేరిట చంద్రబాబు టూర్ ఖరారు
సరికొత్తగా యమహా ఆర్15ఎం.. క్రేజీ లుక్.. కిర్రాక్ ఫీచర్స్..
సరికొత్తగా యమహా ఆర్15ఎం.. క్రేజీ లుక్.. కిర్రాక్ ఫీచర్స్..
తంగలాన్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఊహించలేరు
తంగలాన్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఊహించలేరు
ఐఫోన్‌ 17 ఎలా ఉండనుంది? 16 సిరీస్‌ కంటే బెస్ట్‌ ఫీచర్స్‌ ఉంటాయా?
ఐఫోన్‌ 17 ఎలా ఉండనుంది? 16 సిరీస్‌ కంటే బెస్ట్‌ ఫీచర్స్‌ ఉంటాయా?
దసరా పోరులో ఐదుగురు హీరోలు.. గెలుపు గుర్రం ఎవరిది.?
దసరా పోరులో ఐదుగురు హీరోలు.. గెలుపు గుర్రం ఎవరిది.?
లైవ్ మ్యాచ్‌లో గొడవ పడిన పంత్, లిటన్ దాస్.. వైరల్ వీడియో
లైవ్ మ్యాచ్‌లో గొడవ పడిన పంత్, లిటన్ దాస్.. వైరల్ వీడియో
తిరుమల లడ్డూ కాంట్రవర్సీ.. చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం
తిరుమల లడ్డూ కాంట్రవర్సీ.. చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం
'లారెన్స్ బిష్ణోయ్‌ను పిలుస్తా'.. సల్మాన్ తండ్రికి మహిళ బెదిరింపు
'లారెన్స్ బిష్ణోయ్‌ను పిలుస్తా'.. సల్మాన్ తండ్రికి మహిళ బెదిరింపు
వీడు ఖతర్నాక్ స్టూడెంట్. ఎగ్జామ్‌లో ప్రశ్నకు ఆన్సర్ ఎలా రాశాడంటే
వీడు ఖతర్నాక్ స్టూడెంట్. ఎగ్జామ్‌లో ప్రశ్నకు ఆన్సర్ ఎలా రాశాడంటే
హోండా నుంచి అప్‌గ్రేడెడ్ ఎలివేట్ వచ్చేసింది..
హోండా నుంచి అప్‌గ్రేడెడ్ ఎలివేట్ వచ్చేసింది..