Boxer MaryKom : బాక్సింగ్‌లో భారత్‌కి మరో పతకం ఖాయం.. బాక్సమ్ ఓపెన్ టోర్నీలో సెమీస్‌కి దూసుకెళ్లిన మేరీకోమ్
Boxer MaryKom : ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ పతకాన్ని ఖాయం చేసుకుంది. బాక్సమ్ ఓపెన్
Boxer MaryKom : ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ పతకాన్ని ఖాయం చేసుకుంది. బాక్సమ్ ఓపెన్ టోర్నీలో మేరీకోమ్ 51 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో ఇటలీకి చెందిన జియోర్డానా సొరెన్‌టినోపై గెలిచింది. సెమీఫైనల్లో అమెరికా బాక్సర్ వర్జీనియాతో మేరీకోమ్ ఆడనుంది. పురుషుల విభాగంలో మనీశ్ (63 కేజీలు) క్వార్టర్ ఫైనల్ చేరాడు. తొలి రౌండ్‌లో మనీశ్ 5–0తో రడుయెన్ (స్పెయిన్)పై నెగ్గాడు.
ఇదిలా ఉంటే.. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబా) చాంపియన్స్ అండ్ వెటరన్ కమిటీ చైర్‌పర్సన్‌గా మేరీకోమ్ నియమించబడ్డారు. గత ఏడాది అంతర్జాతీయ కమిటీలో కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చారు. దీనిలో భాగంగా చాంపియన్స్ అండ్ వెటరన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఆరు సార్లు వరల్డ్ చాంపియన్ అయిన మేరీకోమ్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న మేరీకోమ్ తన నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఐబా ప్రెసిడెంట్ క్రెమ్లెమ్, ఇతర అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాక్సింగ్ చాంపియన్లు, వెటరన్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కాగా, దీనికి సంబంధింని ప్యానెల్ మెంబర్లను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
మరిన్ని వార్తలు చదవండి :