India vs England 4th Test: తొలిరోజు ఆధిపత్యం చెలాయించిన భారత్.. 205 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. ఆటముగిసే సమయానికి భారత్ స్కోరు 24/1

India vs England 4th Test: టీమిండియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో మొదటి రోజు భారత్ ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే

India vs England 4th Test: తొలిరోజు ఆధిపత్యం చెలాయించిన భారత్..  205 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్..  ఆటముగిసే సమయానికి భారత్ స్కోరు 24/1
uppula Raju

|

Mar 04, 2021 | 6:00 PM

India vs England 4th Test: టీమిండియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో మొదటి రోజు భారత్ ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే షాకులపై షాకులిచ్చింది. భారత బౌలర్ల ధాటికి ఒక్కో పరుగు రాబట్టాలంటే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు తలకు మించిన భారమైంది. ఒక్కో బంతిని ఎదర్కోడానికి నానా తంటాలు పడ్డారు. భారత లెప్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇంగ్లాండ్‌కి ప్రారంభంలోనే వికెట్లు తీసి కోలుకోకుండా చేశాడు. జట్టు స్కోరు 15 ఓవర్లలో ఓపెనర్లు ఓపెనర్లు డామ్‌ సిబ్లీ (2), జాక్‌ క్రాలీ (9; 30 బంతుల్లో)ని పెవిలియన్‌ పంపించేశాడు. అనంతరం సిరాజ్ సారథి జో రూట్‌ (5)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ 30 పరుగులకే మూడు కీలక వికెట్లను చేజార్చుకుంది. అయితే జానీ బెయిర్‌స్టో (28; 67 బంతుల్లో 6×4)తో కలిసి బెన్‌స్టోక్స్‌ (55; 121 బంతుల్లో 6×4, 2×6) గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. భోజన విరామానికి జట్టు స్కోరును 74/3కు చేర్చాడు.

లంచ్‌ తర్వాత స్టోక్స్‌-బెయిర్‌ స్టో జోడీ ఒకవైపు ఆచితూచి ఆడుతూనే మరోవైపు అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించింది. నాలుగో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జట్టు స్కోరు 78 వద్ద బెయిర్‌స్టోను ఎల్బీ చేయడం ద్వారా సిరాజ్‌ విడదీశాడు. ఈ క్రమంలో ఒలీపోప్‌ (29; 87 బంతుల్లో 2×4)తో కలిసి స్టోక్స్‌ భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించాడు. జట్టు స్కోరును 100 దాటించాడు. అర్ధశతకం అందుకున్నాడు. క్రీజులో నిలదొక్కుకున్న అతడిని చక్కని ఆర్మ్‌బాల్‌ ద్వారా వాషింగ్టన్‌ సుందర్‌ ఎల్బీగా ఔట్‌ చేశాడు. పిచైన తర్వాత స్పిన్‌ తిరగని బంతి నేరుగా స్టోక్స్‌ ప్యాడ్లను తాకేసింది. దాంతో ఐదో వికెట్‌కు 43 పరుగుల స్టోక్స్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

బెన్‌స్టోక్స్‌ ఔటవ్వడంతో 144/5తో తేనీటి విరామానికి వెళ్లిన ఇంగ్లాండ్‌ను ఒలీ పోప్‌, కొత్త ఆటగాడు డేనియెల్‌ లారెన్స్‌ (46; 74 బంతుల్లో 8×4) కాసేపు ఆదుకున్నారు. ముఖ్యంగా లారెన్స్‌ చూడచక్కని షాట్లు ఆడాడు. అటు స్పిన్‌ ఇటు పేస్‌ను చక్కగా ఎదుర్కొన్నాడు. అడపా దడపా బౌండరీలు బాదుతూ అర్ధశతకంవైపు సాగాడు. ఆరో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఈ క్రమంలో అశ్విన్‌ వేసిన 61.3వ బంతికి ఒలీ పోప్‌.. గిల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అప్పుడు జట్టు స్కోరు 166. మరికాపటికే అక్షర్‌ పటేల్‌ వేసిన 71 ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. తొలి బంతికి లారెన్స్‌ను పంత్‌ స్టంపౌట్‌ చేయగా నాలుగో బంతికి బెన్‌ఫోక్స్‌ ఇచ్చిన (1; 12 బంతుల్లో) ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రహానె అందుకొన్నాడు. ఆ తర్వాత డామ్‌ బెస్‌ (3)ను అక్షర్‌, జాక్‌ లీచ్‌ (7)ను యాష్‌ ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ 205కు ఆలౌటైంది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. అండర్సన్ వేసిన మొదటి బంతికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఖాతా తెరవకుండానే ఇండియా ఒక వికెట్ కోల్పోయింది. దీంతో రోహిత్ , పూజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 12 ఓవర్లకు 24/1 వికెట్‌తో తొలి రోజు ఆట ముగించింది. రోహిత్ శర్మ 8, చటేశ్వర పూజారా15 పరుగులతో క్రీజులో నిలిచారు. భారత్ ఇంకా 181 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌ని అధిగమించవచ్చు. అయితే ఆఖరి 12 ఓవర్లు ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

భారత సంతతి మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు.. అడ్మినిస్ట్రేటివ్‌ లా సబ్‌కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రమీలా జయపాల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu