తమిళనాడులో మరో ముగ్గురిని మింగేసిన జల్లికట్టు, 15 మందికి తీవ్ర గాయాలు, పలువురి పరిస్థితి సీరియస్‌

Jallikattu Event : జల్లికట్టు మనుషుల ప్రాణాలను తీసేస్తోంది. ఎన్నో ఆందోళనలు.. ఎన్నో నిరసన కార్యక్రమాలు జరిగినా.. దీన్ని అడ్డుకునే వారే..

తమిళనాడులో మరో ముగ్గురిని మింగేసిన జల్లికట్టు, 15 మందికి తీవ్ర గాయాలు, పలువురి పరిస్థితి సీరియస్‌
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 26, 2021 | 10:14 PM

Jallikattu Event : జల్లికట్టు మనుషుల ప్రాణాలను తీసేస్తోంది. ఎన్నో ఆందోళనలు.. ఎన్నో నిరసన కార్యక్రమాలు జరిగినా.. దీన్ని అడ్డుకునే వారే లేకుండా పోయారు. మనుషుల జీవితాలను మాత్రం మింగేస్తుంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏదో ఒక చోట.. ఏదో రోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జనాలు చనిపోతూనే ఉన్నారు. అయినా.. సగటు జీవిలో మార్పు రావడం లేదు. చైతన్యం రావడం లేదు.తాజాగా జరిగిన ఘటన ఈ ఉదంతాన్నే గుర్తు చేస్తోంది.

తమిళనాడులోని శివగంగై జిల్లాలో మళ్లీ ఈ ఘోరం జరిగింది. ముగ్గురు అమాయకులు చనిపోయారు. సరదా కోసం ఆటను చూసేందుకు వచ్చిన వారు కూడా మృత్యువువాత పడ్డారు. ఆటను చూస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షత గాత్రులను దగ్గరిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే.. వారిలో ముగ్గురు పరిస్థితి సీరియస్‌గా ఉంది. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

శివగంగై జిల్లాలో కొద్ది రోజులుగా ఈ జల్లికట్టు క్రీడలు జరుగుతున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ గ్రౌండ్‌లోకి దిగేందుకు కూడా యువకులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి.. ఎద్దులతో పోటీ పడ్డారు. అయితే.. పౌరుషంతో ఉన్న ఓ ఎద్దు.. గ్రౌండ్‌ బయట ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. అంతే.. ఈ ఎద్దు కొమ్ములు గుచ్చుకొని.. ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. గేమ్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఆటలకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు? తీసుకుంటే ఎక్కడ తీసుకున్నారు? ఎవరు ఇచ్చారు? అన్న కోణంలో విచాణ చేస్తున్నారు.

Read also : తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల క్లియర్ పిక్చర్, ఉసంహరణ గడువు ముగిసిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!