AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olympics: ఒలింపిక్స్‌లో వరుసగా 2 పతకాలతో రికార్డ్.. కట్‌చేస్తే.. నేడు తీహార్ జైలులో.. ఆ భారత అథ్లెట్ ఎవరంటే?

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ గేమ్స్ జులై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ మంది క్రీడాకారులు ఒలింపిక్స్ 2024లో పాల్గొంటారు. ఒలింపిక్స్‌ చరిత్ర గురించి చెప్పాలంటే భారత్‌ పేరిట ఇప్పటి వరకు మొత్తం 35 పతకాలు ఉన్నాయి. పతకాల పరంగా భారతదేశం నుంచి అత్యుత్తమ ప్రదర్శన టోక్యో 2020లో నమోదైంది. ఇక్కడ భారత జట్టు ఒక స్వర్ణంతో సహా మొత్తం ఏడు పతకాలను గెలుచుకుంది.

Olympics: ఒలింపిక్స్‌లో వరుసగా 2 పతకాలతో రికార్డ్.. కట్‌చేస్తే.. నేడు తీహార్ జైలులో.. ఆ భారత అథ్లెట్ ఎవరంటే?
Athlete Sushil Kumar
Venkata Chari
|

Updated on: Jul 20, 2024 | 4:44 PM

Share

Sushil Kumar: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ గేమ్స్ జులై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ మంది క్రీడాకారులు ఒలింపిక్స్ 2024లో పాల్గొంటారు. ఒలింపిక్స్‌ చరిత్ర గురించి చెప్పాలంటే భారత్‌ పేరిట ఇప్పటి వరకు మొత్తం 35 పతకాలు ఉన్నాయి. పతకాల పరంగా భారతదేశం నుంచి అత్యుత్తమ ప్రదర్శన టోక్యో 2020లో నమోదైంది. ఇక్కడ భారత జట్టు ఒక స్వర్ణంతో సహా మొత్తం ఏడు పతకాలను గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్ పతకం సాధించడం ప్రతి భారతీయ అథ్లెట్ కల. ఒక భారతీయ అథ్లెట్ వరుసగా రెండుసార్లు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న ఘనతను సాధించాడు. కానీ, అతను ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు.

ఈ ఛాంపియన్ ప్లేయర్ కటకటాల వెనుక..

భారత రెజ్లింగ్‌లో రెజ్లర్ సుశీల్ కుమార్.. ఓ సంచలనం. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా సుశీల్ కుమార్ ఘనత సాధించాడు. తన విజయంతో సుశీల్ దేశంలోని యువ రెజ్లర్లకు రోల్ మోడల్ గా నిలిచాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సుశీల్‌ కుమార్‌ నేడు కటకటాలపాలయ్యాడు. యువ రెజ్లర్ సాగర్ ధంఖర్ హత్యకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతని క్రీడా జీవితం పూర్తిగా నాశనమైంది.

సుశీల్ కెరీర్‌పై నీలినీడలు..

రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో ఒలింపియన్ సుశీల్ కుమార్ జైలులో ఉన్నాడు. 2021 మే 4న ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ ధనకర్ హత్యకు గురయ్యాడు. మే 23న సుశీల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సాగర్ హత్యకు సంబంధించిన ఆరోపణలను కూడా అంగీకరించాడు. 2012 ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తర్వాత.. సుశీల్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. విజయ గర్వం తలకెక్కిందని, ఈ క్రమంలో చెడు అలవాట్లకు బానిగా మారడంతోపాటు ఇతరులపై ఆవేశంతో దాడులకు పాల్పడేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవానికి, భారతదేశంలోని కుస్తీ ఆట ఆటగాళ్లను కోర్టులోనే కాకుండా బయట కూడా చాలా పవర్ ఫుల్ వ్యక్తులుగా చేస్తుందని చెబుతుంటారు. సుశీల్ కుమార్ వ్యక్తిత్వం కూడా ఇదే మార్గం ఎంచుకున్నాడు.

భారతదేశపు అత్యంత విజయవంతమైన రెజ్లర్లలో ఒకడిగా..

రెజ్లర్ సుశీల్ కుమార్ తన కెరీర్‌లో చాలా పెద్ద ఈవెంట్‌లను గెలుచుకున్నాడు. అతను 1988 వరల్డ్ క్యాడెట్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అంతే కాకుండా రెండు సార్లు ఒలింపిక్స్‌లో దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆధిపత్యం ప్రదర్శించాడు. అతను 2010, 2014, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. ఆ తరువాత, అతను 2010 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. ఈ బలమైన ప్రదర్శనతో అర్జున అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, పద్మశ్రీతో ప్రభుత్వం సత్కరించారు. కానీ నేడు జైలు జీవితం గడుపుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..