FIFA WC 2022: ప్రపంచ కప్ చరిత్రలోనే తొలిసారి.. ఈ ఏడాది ఫిఫాతో మారనున్న మూస ధోరణి..
Germany బs Costa Rica: పురుషుల ప్రపంచకప్ మ్యాచ్‌లో స్టెఫానీ ఫ్రాపార్ట్ రిఫరీగా వ్యవహరించిన తొలి మహిళా రిఫరీగా అవతరించనుంది.
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా మహిళా రిఫరీ మైదానంలో కనిపించనున్నారు. దీంతో ఈ ఏడాది ఫిఫాలో సరికొత్త చరిత్ర ఏర్పడనుంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా, గురువారం కోస్టారికా-జర్మనీ మధ్య జరిగే లీగ్ దశ మ్యాచ్‌లో రిఫరీలందరూ మహిళలే కావడం విశేషం. స్టెఫానీ ఫ్రాపార్ట్ పురుషుల ప్రపంచకప్ మ్యాచ్‌లో మొదటి మహిళా రిఫరీగా వ్యవహరించనున్నారు.
గత మంగళవారం పోలాండ్ వర్సెస్ మెక్సికో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫ్రాపార్ట్ నాల్గవ అధికారిగా ఎంపికైంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న మొదటి మహిళా రిఫరీగా నిలవనుంది. ఫ్రాపార్ట్‌తో పాటు బ్రెజిల్‌కు చెందిన న్యూజా బ్యాక్, మెక్సికోకు చెందిన కరెన్ డియాజ్ అసిస్టెంట్ రిఫరీలుగా ఉంటారు. 2020లో, పురుషుల ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో రిఫరీ చేసిన మొదటి మహిళగా ఫ్రాపార్ట్ నిలిచింది. మహిళా రిఫరీలందరినీ తొలిసారి చూడటం అభిమానులకు భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఫ్రాపార్ట్ చాలా కాలంగా పురుషుల ఆటలోనే..
38 ఏళ్ల ఫ్రాపార్ట్ చాలా కాలంగా పురుషుల ఆటలో పాల్గొంటుంది. 2019లో లివర్‌పూల్ వర్సెస్ చెల్సియా మధ్య జరిగిన యూరోపియన్ సూపర్ కప్ మ్యాచ్‌లో ఆమె రిఫరీగా కూడా ఉంది. దీంతో ఆమె ప్రధాన పురుషుల UEFA టోర్నమెంట్‌లో రిఫరీ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందనుంది. జర్మనీ వర్సెస్ కోస్టారికా మధ్య మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే జర్మనీ భవిష్యత్తు దానిపై ఆధారపడి ఉంటుంది. జర్మనీ తదుపరి రౌండ్‌కు వెళ్లాలనే ఆశను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా కోస్టారికాపై గెలవాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..