Iga Swiatek: ఆటే కాదు.. మాటలతోనూ ప్రేక్షకుల మనసు గెలిచిన స్వైటెక్‌.. ఉక్రెయిన్ యుద్ధంపై ఏమందంటే?

టైటిల్‌ గెలవడమే కాదు.. ఇగా స్వైటెక్‌ తన మాటలతో ప్రపంచ ప్రజల మనసులను కూడా గెలుచుకుంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఉమెన్స్‌ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత..

Iga Swiatek: ఆటే కాదు.. మాటలతోనూ ప్రేక్షకుల మనసు గెలిచిన స్వైటెక్‌.. ఉక్రెయిన్ యుద్ధంపై ఏమందంటే?
Iga Swiatek
Follow us
Venkata Chari

|

Updated on: Jun 05, 2022 | 6:18 AM

పోలెండ్‌ దేశానికి చెందిన ఇగా స్వైటెక్‌(Iga Swiatek).. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌లో విజేతగా నిలిచింది. ఫైనల్లో అమెరికాకు చెందిన కోకో గాఫ్‌పై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్‌ మొత్తం దాదాపుగా వన్‌సైడ్‌గా సాగింది. స్వైటెక్‌ ముందు కోకో గాఫ్‌ నిలవలేకపోయింది. ఫోర్‌ హ్యాండ్‌, బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడింది స్వైటెక్‌. మొత్తం 68 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 6-1, 6-3 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌‌ను తన ఖాతాలో వేసుకుంది. 2020లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన స్వైటెక్‌.. తాజాగా మరోసారి ట్రోఫీని ముద్దాడింది.

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌లో విజేతగా నిలిచిన తర్వాత స్వైటెక్ ఉద్వేగానికి లోనైంది. మొదటగా తన టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపింది. తన తండ్రికి, సోదరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల క్రితం ఇలాంటి విజయమే సాధించినా.. ఇది మాత్రం ఎంతో ప్రత్యేకం అని తెలిపింది. ఈసారి విజయం కోసం మరింత హార్డ్‌ వర్క్‌ చేయాల్సి వచ్చిందని, స్టేడియానికి వచ్చి ప్రోత్సహించిన అభిమానులకు కూడా స్వైటెక్‌ కృతజ్ఞతలు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇక ప్రపంచవ్యాప్తంగా బర్నింగ్‌ టాపిక్‌గా ఉన్న ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంపై స్వైటెక్‌ కామెంట్‌ చేసి, వార్తల్లో నిలిచింది. ‘ఉక్రెయిన్‌ ప్రజలకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అక్కడ పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పటికీ ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతోంది. వచ్చే ఏడాది నాటికి ఉక్రెయిన్‌లో పరిస్థితులు యధాస్థితికి వస్తాయని ఆశిస్తున్నానని’ స్వైటెక్‌ పేర్కొంది.