పెళ్లి కాకుండానే ముగ్గురు పిల్లలు.. కట్‌చేస్తే.. 44 ఏళ్ల వయసులో 4సారి తల్లి కాబోతున్నానంటూ షాకిచ్చిందిగా..
Former Russian Tennis Player Anna Kournikova Pregnant: నిరంతర గాయాలు ఆమె కెరీర్‌ను కుంగదీశాయి. 1997, 2001 మధ్య, ఆమె అనేకసార్లు ఒత్తిడి, తీవ్రమైన గాయాలతో బాధపడింది. చివరికి, 2003 లో, కేవలం 21 సంవత్సరాల వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది.

Former Russian Tennis Player Anna Kournikova Pregnant: ప్రముఖ రష్యన్ మాజీ టెన్నిస్ స్టార్ అన్నా కోర్నికోవా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. 44 సంవత్సరాల వయసులో, ఆమె నాల్గవసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించడం ద్వారా తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె భాగస్వామి, ప్రముఖ స్పానిష్ గాయకుడు ఎన్రిక్ ఇగ్లేసియాస్ (50), వారి నాల్గవ బిడ్డకు స్వాగతం పలకబోతున్నారన్నమాట. కొన్ని నెలల క్రితం, అన్నా వీల్‌చైర్, ప్రొటెక్టివ్ బూట్‌లో కనిపించింది. ఆ సమయంలో, ఆమె ఆరోగ్యం గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆమె గర్భవతి అని తేలడంతో అభిమానులు ఉపశమనం పొందారు. కోర్నికోవా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని స్పానిష్ మ్యాగజైన్ హోలా పేర్కొంది.
ఇప్పటికే ముగ్గురు పిల్లల తల్లిగా..
అన్నా, ఎన్రిక్‌లకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కవలలు లూసీ, నికోలస్, 7 సంవత్సరాలు కాగా, చిన్న కుమార్తె మేరీకి 5 సంవత్సరాలు ఉన్నాయి. ఇటీవల ఆమె పిల్లలను మయామిలోని మార్షల్ ఆర్ట్స్ తరగతికి తీసుకెళ్తున్నట్లు కనిపించింది. దీంతో ఆమె ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు స్పష్టం చేసింది.
14 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అడుగుపెట్టింది. సింగిల్స్‌లో గ్రాండ్ స్లామ్ ట్రోఫీని గెలవలేకపోయినప్పటికీ, 1999, 2002లో మార్టినా హింగిస్‌తో జతకట్టి ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. కోర్టులో ఆమె పవర్ గేమ్, మైదానం బయట తన అందంతో ఎల్లప్పుడూ వార్తల్లో ఉండేది.
గ్లామర్ క్వీన్..
2002లో, బ్రిట్నీ స్పియర్స్, జెన్నిఫర్ లోపెజ్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి, ఆమె ప్రపంచంలోనే అత్యంత సెక్సీయెస్ట్ మహిళగా ఎన్నికైంది. 2010లో, ఆమె అన్ని కాలాలలోనూ అత్యంత సెక్సీయెస్ట్ టెన్నిస్ క్రీడాకారిణిగా కూడా ఎంపికైంది.
గాయాలతో కెరీర్‌ను క్లోజ్..
నిరంతర గాయాలు ఆమె కెరీర్‌ను కుంగదీశాయి. 1997, 2001 మధ్య, ఆమె అనేకసార్లు ఒత్తిడి, తీవ్రమైన గాయాలతో బాధపడింది. చివరికి, 2003 లో, కేవలం 21 సంవత్సరాల వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది.
ఎన్రిక్‌తో జీవితం..
2001లో ఎన్రిక్ హిట్ సాంగ్ ఎస్కేప్ కోసం మ్యూజిక్ వీడియో షూటింగ్ సమయంలో వీరిద్దరూ కలిశారు. అక్కడి నుంచి వీరి సంబంధం మొదలైంది. అప్పటి నుంచి వీరు కలిసి ఉన్నారు. ఈ జోడీ గత రెండు దశాబ్దాలుగా మయామిలో నివసిస్తున్నారు. ఇటీవల, ఇద్దరూ బే పాయింట్ ప్రాంతంలో $6.5 మిలియన్ల విలువైన కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఇందులో ఐదు బెడ్ రూములు, విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.
పెళ్లి కాకుండానే..
అన్నా, ఎన్రిక్ వివాహం చేసుకున్నారా లేదా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని తెలుస్తోంది. పెళ్లి కాకుండానే ఇప్పటికే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన వీరు.. త్వరలో తమ నాల్గవ బిడ్డ రాకకోసం ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








