FIFA World Cup 2022: 32 దేశాలు, 29 రోజలు.. ఫిఫా సమరానికి రంగం సిద్ధం.. నేటి నుంచే వార్మప్ మ్యాచ్‌లు..
FIFA WC Warmup Matches: మెగా ఈవెంట్‌లో భాగంగా వార్మప్ మ్యాచ్‌లు నేటి నుంచి ప్రారంభమవుతాయి. అసలు సమరం నవంబర్ 20 నుంచి మొదలుకానుంది.
FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్లు మిడిల్ ఈస్ట్ దేశాలలో అడుగుపెట్టాయి. దీంతో వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు రంగం సిద్ధమైంది. ప్రపంచకప్‌లో పాల్గొనే 32 జట్లలో 20 జట్లకు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. నేటి నుంచే వార్మప్ మ్యాచ్‌లతో సందడి చేసేందుకు అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఇందులో లియోనెల్ మెస్సీ అర్జెంటీనా టీం నుంచి క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ టీం వరకు ఉన్నా్యి. బ్రెజిల్, ఇంగ్లండ్, ఇరాన్, వేల్స్‌లకు ప్రీ-టోర్నమెంట్ స్నేహపూర్వక మ్యాచ్‌లు ఉండవు. నవంబర్ 20 నుంచి ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌ల మ్యాచ్‌లు (భారత కాలమానం ప్రకారం)
నవంబర్ 15: సెనెగల్ vs కజఖస్తాన్ – (UAE)
నవంబర్ 16: UAE vs అర్జెంటీనా – రాత్రి 9 గం (మహమ్మద్ బిన్ జాయెద్ స్టేడియం, UAE)
నవంబర్ 16: ఒమన్ vs జర్మనీ – రాత్రి 10:30 (సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఒమన్)
నవంబర్ 16: ఇరాన్ vs ట్యునీషియా – సాయంత్రం 4:30 (దోహా)
నవంబర్ 16: సౌదీ అరేబియా vs క్రొయేషియా – మధ్యాహ్నం 3:30 (మర్సూల్ పార్క్, రియాద్)
నవంబర్ 16: పోలాండ్ vs చిలీ – రాత్రి 10:30 (పోలిష్ ఆర్మీ స్టేడియం, వార్సా)
నవంబర్ 17: మెక్సికో vs స్వీడన్ – ఉదయం 1 గం (మాంటిలివి స్టేడియం, గిరోనా)
నవంబర్ 17: కెనడా vs జపాన్ – రాత్రి 7:10 (అల్ మక్తూమ్ స్టేడియం, యుఎఇ)
నవంబర్ 17: జోర్డాన్ vs స్పెయిన్ – రాత్రి 9:30 (అమ్మాన్ ఇంటర్నేషనల్ స్టేడియం, ఓమన్)
నవంబర్ 17: ఇరాక్ vs కోస్టారికా – రాత్రి 7:30 (బాస్రా ఇంటర్నేషనల్ స్టేడియం, బస్రా)
నవంబర్ 17: మొరాకో vs జార్జియా – రాత్రి 9:30 (షార్జా స్టేడియం, షార్జా)
నవంబర్ 17: స్విట్జర్లాండ్ vs ఘనా – మధ్యాహ్నం 3:30 (బనియాస్ స్టేడియం, అబుదాబి)
నవంబర్ 18: కామెరూన్ vs పనామా – మధ్యాహ్నం 3:30 (మహమ్మద్ బిన్ జాయెద్ స్టేడియం, అబుదాబి)
నవంబర్ 18: పోర్చుగల్ vs నైజీరియా – ఉదయం 12:15 (ఎస్టాడియో జోస్ అల్వాలాడే, లిస్బన్)
నవంబర్ 18: ఈజిప్ట్ vs బెల్జియం – రాత్రి 8:30 (జాబర్ అల్-అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియం, కువైట్ సిటీ)
నవంబర్ 18: బహ్రెయిన్ vs సెర్బియా – రాత్రి 9:30 (బరైన్ నేషనల్ స్టేడియం, రిఫా)
ఈ క్రమంలో తుది జట్లను సమర్పించే గడువు నేటితో ముగుస్తుంది. ఫిపా సమరంలో పాల్గొనే 32 దేశాలు మెగా టోర్నీకి ముందు గాయాలతో తలలు పట్టుకుంటున్నాయి. నవంబర్ 20న ఖతార్ vs ఈక్వెడార్ మ్యాచ్‌తో ఖతార్‌లో ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.