Tokyo Olympics: భారత అథ్లెట్లకు బీసీసీఐ రూ. 10 కోట్ల ఆర్థికసాయం
టోక్యోలో జులై నుంచి జరగనున్న ఒలింపిక్స్ లో భారత్ నుంచి దాదాపు 99 మంది అథ్లెట్స్ పాల్గొన బోతున్నారు. వీరంతా 13 కేటగిరీల్లో పాల్గొంటారు.
Tokyo Olympics: టోక్యోలో జులై నుంచి జరగనున్న ఒలింపిక్స్ లో భారత్ నుంచి దాదాపు 99 మంది అథ్లెట్స్ పాల్గొన బోతున్నారు. వీరంతా 13 కేటగిరీల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో భారత అథ్లెట్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆర్థికసాయం ప్రకటించింది. భారత అథ్లెట్ల శిక్షణ, సన్నాహాలకు రూ.10 కోట్లు అందనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొన్నారు.
ఒలింపిక్స్ కు అర్హత సాధించిన అథ్లెట్లు మెరుగైన రీతిలో ప్రిపేర్ అయ్యేందుకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని బీసీసీఐ పేర్కొంది. ఈ నిధిని ఎలా ఉపయోగించేది కేంద్ర క్రీడల శాఖ, భారత ఒలింపిక్ సంఘం సంయుక్తంగా ఖరారు చేసుకుంటాయిని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్ గతేడాది జరగాల్సి ఉంది. కానీ, కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.
జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో 205 దేశాలనుంచి 11,091 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. అయితే, జపాన్ లో కరోనా కారణంగా అక్కడి వైద్య సంఘాలు ఒలింపిక్స్ నిర్వహించడంపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒలింపిక్స్ నిర్వహిస్తే.. తరువాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని ఆరోపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే అక్కకి చేరుకున్ ఉగాంగా దేశ కోచ్‌కి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. మరోవైపు భారత్ అథ్లెట్లకు విధించిన నిబంధనలపై భారతీయ ఒలింపిక్ సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. టోక్యోకు బయల్దేరు ముందు వారం రోజులపాటు కరోనా టెస్టులు చేసుకుకోవాలని, ఎవరితో కలవకూడదని, మాట్లాడకూడదని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. గతనెలలో దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండండంతో భారత్‌ను గ్రేడ్ 1 దేశాల జాబితాలో చేర్చింది.
NEWS ? Key decisions taken at 8th Apex Council Meeting of BCCI
BCCI has decided to extend support to the Indian Olympic Association and has pledged a monetary gesture of Rs. 10 crores.
— BCCI (@BCCI) June 20, 2021
Also Read:
IND Vs NZ, WTC Final 2021 Day 3 Live: ముగిసిన మూడవ రోజు ఆట.. న్యూజిలాండ్ స్కోర్ 101/2…
WTC Final 2021: పుజారాపై పేలుతోన్న మీమ్స్.. ఒక్క పరుగు కోసం అన్ని బంతులా!