Indian Women’s Football Team: భారత్‌లో కరోనాతోపాటు కొత్త వేరియంట ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఎన్నో కార్యక్రమాలు కూడా రద్దవుతున్నాయి. అయితే ఈ వైరస్ ప్రభావం క్రీడల్లోనూ తన పంజా విసురుతోంది. దేశవాలీ ట్రోఫీలతోపాటు పలు అంతర్జాతీయ టోర్నీలు కూడా రద్దవుతున్నాయి. తాజాగా భారత మహిళల ఫుట్‌బాల్ (Indian Women’s Football Team)జట్టులో కరోనా కలకలం రేపింది. జట్టులోని 13 మంది ఆటగాళ్లు కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో ఏఎఫ్‌సీ మహిళల ఆసియా కప్(Asia Cup 2022)లో భారత్ ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లు రద్దయ్యాయి. భారత మహిళల జట్టు ఆదివారం చైనీస్ తైపీతో రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ, ఆటగాళ్లకు కోవిడ్ నేపథ్యంలో ఈ మ్యాచులన్నీ రద్దు చేశారు.
ఈ టోర్నీ నుంచి భారత మహిళల టీం తప్పుకోవడంతో వచ్చే ఏడాది జరిగే మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాలన్న కల కూడా చెదిరిపోయింది. ఆసియా టోర్నీలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరి ఉంటే.. ప్రపంచకప్‌కు టికెట్ లభించేది. కానీ,ప్రస్తుతం ఆ ఛాన్స్ లేదు.
ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య, ‘టోర్నీ నుంచి వైదొలగాలన్న భారత్ నిర్ణయాన్ని ఆమోదించాం. టోర్నీలో భారత్, చైనీస్ తైపీ మధ్య మ్యాచ్ జరగలేదు. ఆ తర్వాత, ఫెడరేషన్‌లోని ఆర్టికల్ 4.1 ప్రకారం, భారతదేశం టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. దీంతో ఆర్టికల్ 6.5.5 ప్రకారం భారత్ పోటీలు టోర్నీలో ఉండవు. నిబంధనల ప్రకారం, టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ఒక జట్టు తన పేరును ఉపసంహరించుకుంటే, దాని మ్యాచ్‌లన్నీ రద్దు చేస్తున్నట్లు పరిగణిస్తారు’ అని పేర్కొంది.
ఇరాన్‌పై డ్రా.. టోర్నమెంట్‌లో భారతదేశం మొదటి మ్యాచ్ ఇరాన్‌తో జరిగింది. ఈ మ్యాచ్ డ్రా అయింది. భారత్‌తో పాటు చైనా, చైనీస్ తైపీ, ఇరాన్‌లు గ్రూప్-ఏలో ఉన్నాయి. బుధవారం తదుపరి మ్యాచ్ చైనాతో ఆడాల్సి ఉంది. భారతదేశం మొదటి మ్యాచ్ నుంచి అన్ని పాయింట్లు, గోల్స్ గ్రూప్ చివరి ర్యాంకింగ్‌లో చేర్చడం కుదరదని AFC తెలిపింది.
విచారం వ్యక్తం చేసిన భారత ఫుట్‌బాల్ సమాఖ్య.. ఈ పరిణామంపై భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ విచారం వ్యక్తం చేశారు. ‘బహుశా దేశం మొత్తం ఇప్పుడు ఎలా ఉంటుందో నేను కూడా నిరాశకు లోనయ్యాను అని అన్నాడు. అయితే, ఆటగాళ్ల ఆరోగ్యం, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యమైనది. కరోనా సోకిన ఆటగాళ్లందరికీ త్వరగా కోలుకోవాలంని కోరుకుంటున్నాను. వీరికి AIFF పూర్తి సహాయాన్ని అందజేస్తుంది. అలాగే తొలి మ్యాచ్‌లో జట్టు కనబరిచిన అద్భుతమైన ఆటతీరుకు గర్వపడుతున్నా.. ముందుకు వెళ్లేందుకు వారు తమ సత్తాను నిరూపించుకుంటారని నేను నమ్ముతున్నాను’ అంటూ పేర్కొన్నారు.
Also Read: IND vs SA: ‘జై శ్రీరామ్’ అంటూ సౌతాఫ్రికా ప్లేయర్ ట్వీట్.. నెట్టింట్లో వైరల్.. ఎందుకంటే?
Shoaib Akhtar: టీమిండియాలో ఐక్యత లోపించింది.. అందుకే టెస్టు, వన్డే సిరీస్ ఓడిపోయారు..