నేను ధోనీని కాదన్న ఆసీస్ కీపర్… నవ్వుతూ బదులిచ్చిన భారత బ్యాట్స్‌మెన్… రెండో టీ20లో ఆసక్తికర సంఘటన
భారత ఆటగాడు ధావన్ తొమ్మిదో ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆసీస్ ఆటగాడు ధోనిని తలచుకున్నాడు...

ఆసీస్ వేదికగా భారత్ సుదీర్ఘ క్రికెట్ సిరీస్ ఆడుతోంది. డిసెంబర్ 6న సిడ్నీ వేదిక భారత్ ఆసీస్‌తో రెండో టీ20 మ్యాచ్ ఆడింది. ఆతిథ్య జట్టు భారత్‌కు 195 లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం లభించింది.
ధావన్ ధాటిగా బ్యాటింగ్… స్టంపౌట్‌కు అవకాశం….
ఆసీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధావన్ ధాటిగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆసీస్ బౌలర్ స్వెప్సన్ వేసిన తొమ్మిది ఓవర్ చివరి బంతిని ఆడబోయిన ధావన్ క్రీజులోంచి కాలు పైకి లేపడం, ఆసీస్ కీపర్ వైడ్ స్టంపౌట్ చేయడం క్షణంలో జరిగిపోయాయి. ఆ తర్వాత అప్పీల్… ఎంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో తిరిగి క్రీజులోకి వచ్చిన ధావన్‌తో ఆసీస్ కీపర్ నేను ధోనిని కాదు… ధోని అంత వేగంగా స్టంపౌట్ చేయలేనని(Not Dhoni, not quick enough like dhoni) అన్నాడు. దానికి బదులు ఇస్తూ ధావన్ కూడా అవును అనే సమాధానమిచ్చాడు. ఇది అంతా వికెట్‌లో ఉన్న మైక్ లో రికార్డు అయ్యింది. దీంతో ధోని అభిమానులు వైడ్ స్టంపౌట్‌ను, ధోని చేసిన స్టంపౌట్‌ను పోలుస్తూ.. వీడియోలను వైరల్ చేస్తున్నారు.