AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్​ శర్మ, బుమ్రా లేకున్నా టీ20 సిరీస్ గెలిచాం.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీమిండియ సారథి

రోహిత్​ శర్మ, బుమ్రా లాంటి స్టార్​ ఆటగాళ్లు లేకపోయినా ప్రస్తుత జట్టు బాగా రాణించి సిరీస్​ను కైవసం చేసుకుందని కెప్టెన్​ విరాట్​ కోహ్లీ మరో కాంట్రవర్సికీ తెరలేపాడు. మరోవైపు హార్దిక్​ పాండ్య ఆటతీరుపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.

రోహిత్​ శర్మ, బుమ్రా లేకున్నా టీ20 సిరీస్ గెలిచాం.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీమిండియ సారథి
Sanjay Kasula
|

Updated on: Dec 06, 2020 | 8:57 PM

Share

రోహిత్​ శర్మ, బుమ్రా లాంటి స్టార్​ ఆటగాళ్లు లేకపోయినా ప్రస్తుత జట్టు బాగా రాణించి సిరీస్​ను కైవసం చేసుకుందని కెప్టెన్​ విరాట్​ కోహ్లీ మరో కాంట్రవర్సికీ తెరలేపాడు. మరోవైపు హార్దిక్​ పాండ్య ఆటతీరుపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్​ఇండియా ఆటతీరు పట్ల కెప్టెన్ విరాట్​ కోహ్లీ సంతృప్తిని వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ, జస్​ప్రీత్​ బుమ్రా వంటి స్టార్​ ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా మిగిలిన ఆటగాళ్లు రాణించడంపై హర్షం వ్యక్తం చేశాడు.

టీ20 సిరీస్​లో చాలా బాగా ఆడామని అన్నాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్టులైన రోహిత్ శర్మ, బుమ్రా వంటి స్టార్లు ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా టీమిండియా జట్టు బాగా రాణించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ టీమ్​ పట్ల  తానెంతో గర్వంగా ఉన్నాను అంటూ అభిప్రాయపడ్డారు.

2016లో హార్దిక్​ జట్టులో ఎంపికవ్వడానికి ప్రధాన కారణం అతడి సామర్థ్యమే అంటూ ప్రశంసించాడు. అతడిలో అసలైన ప్రతిభ ఉందంటూ పేర్కొన్నాడు. రాబోయే 4-5 ఏళ్లలో మరింత అత్యుత్తమంగా ఆడతాడు అంటూ అభినందించాడు వన్డే సిరీస్​లో ఓడిన తర్వాత టీ20 సిరీస్​లో అత్యుత్తమంగా రాణించాలని తామంతా భావించినట్లు కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్​ వల్ల టీమ్​ఇండియా బలమైన టీ20 జట్టుగా మారిందని అభిప్రాయపడ్డాడు.