రోహిత్ శర్మ.. అప్పుడు మీకు గుర్తురాదా..! నెటిజన్ల ఫైర్

టీమిండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరా చెప్పేది..? అంటూ ప్రశ్నిస్తున్నారు..? అసలు ఇంతలా రోహిత్‌పై నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారంటే..! దీపావళి సందర్భంగా రోహిత్ తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో టపాసుల శబ్దానికి వీధి కుక్క భయపడుతుండగా.. ‘‘నా తోటి భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మనకు మరింత కాంతిని ఇస్తుందని, ఆశిస్తున్నా. టపాసులను పేల్చే ముందు వీటిని గుర్తుంచుకోండి. అవి భయపడుతుంటే చూసేందుకు […]

  • Publish Date - 9:02 am, Tue, 29 October 19 Edited By:
రోహిత్ శర్మ.. అప్పుడు మీకు గుర్తురాదా..! నెటిజన్ల ఫైర్

టీమిండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరా చెప్పేది..? అంటూ ప్రశ్నిస్తున్నారు..? అసలు ఇంతలా రోహిత్‌పై నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారంటే..!

దీపావళి సందర్భంగా రోహిత్ తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో టపాసుల శబ్దానికి వీధి కుక్క భయపడుతుండగా.. ‘‘నా తోటి భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మనకు మరింత కాంతిని ఇస్తుందని, ఆశిస్తున్నా. టపాసులను పేల్చే ముందు వీటిని గుర్తుంచుకోండి. అవి భయపడుతుంటే చూసేందుకు బాధగా ఉంది’’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కేవలం దీపావళి సమయంలో మీ అందరికీ కాలుష్యం సంగతి గుర్తొస్తుందా అంటూ విమర్శించారు. ‘‘ఐపీఎల్ లాంటి ఈవెంట్లలో అనవసరంగా బాణాసంచా కాలుస్తుంటారు. ట్రోఫీ గెలిచినప్పుడు మీ జట్టు సభ్యులు అంతా కలిసి బాణా సంచా పేలుస్తుంటారు అప్పుడు ఇవన్నీ ఏం గుర్తురావా..?’’ అంటూ కామెంట్లు పెట్టారు. అంతేకాదు గతంలో దీపావళి సందర్భంగా టపాసులు కాల్చామంటూ ఆయన వేసిన ట్వీట్‌ను కూడా నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.