ఎక్కువ ఆలోచించకండి… ధోని ఇప్పట్లో రిటైర్ అవ్వడు!
మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ప్రపంచకప్ అనంతరం రిటైర్మెంట్‌ను ప్రకటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. వరల్డ్‌కప్ ముగిసింది. టీమిండియా సెమీఫైనల్‌లోనే నిష్క్రమించింది. కోహ్లీసేన కప్పు గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించినా.. చివరికి నిరాశే మిగిలింది. ఇది ఇలా ఉంటే రెండు రోజుల్లో విండీస్ టూర్‌కు ఎంపిక చేసే జట్టులో ధోనికి చోటు ఉండదని.. దాన్ని బట్టే ధోని రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ […]
మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ప్రపంచకప్ అనంతరం రిటైర్మెంట్‌ను ప్రకటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. వరల్డ్‌కప్ ముగిసింది. టీమిండియా సెమీఫైనల్‌లోనే నిష్క్రమించింది. కోహ్లీసేన కప్పు గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించినా.. చివరికి నిరాశే మిగిలింది. ఇది ఇలా ఉంటే రెండు రోజుల్లో విండీస్ టూర్‌కు ఎంపిక చేసే జట్టులో ధోనికి చోటు ఉండదని.. దాన్ని బట్టే ధోని రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో అతడికి అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన అరుణ్ పాండే మీడియాతో మాట్లాడుతూ ధోని రిటైర్మెంట్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచన ధోనికి లేదు. అతడు వ్యక్తిగతంగా కంటే జట్టు ప్రయోజనాల కోసం ఎక్కువగా ఆలోచిస్తాడు’ అని అరుణ్ పాండే స్పష్టం చేశాడు.