శ్రీలంక కంటే మేమే స్ట్రాంగ్- బంగ్లా ఆల్‌రౌండర్ హొసేన్
శ్రీలంక జట్టు కన్నా అన్ని విభాగాల్లో తామే బలంగా ఉన్నామని బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మొసాద్దెక్ హొసేన్ అన్నాడు. వచ్చేవారం లంకతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో మొసాద్దెక్ మాట్లాడాడు. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ ఏడు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగ్గా అందులో లంక జట్టు ఐదు సిరీస్‌లు గెలిచింది. మరో రెండు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. అయితే ఇటీవలి కాలంలో తమ జట్టు అనూహ్యంగా పుంజుకుందని, ప్రస్తుతం శ్రీలంక కన్నా బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు అనుభవంలోనూ […]
శ్రీలంక జట్టు కన్నా అన్ని విభాగాల్లో తామే బలంగా ఉన్నామని బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మొసాద్దెక్ హొసేన్ అన్నాడు. వచ్చేవారం లంకతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో మొసాద్దెక్ మాట్లాడాడు. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ ఏడు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగ్గా అందులో లంక జట్టు ఐదు సిరీస్‌లు గెలిచింది. మరో రెండు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. అయితే ఇటీవలి కాలంలో తమ జట్టు అనూహ్యంగా పుంజుకుందని, ప్రస్తుతం శ్రీలంక కన్నా బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు అనుభవంలోనూ ఎంతో మెరుగ్గా ఉందని మొసాద్దెక్ పేర్కొన్నాడు.
మరోవైపు ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌లో ఆడటంలేదు. అలాగే బౌలర్ మహ్మదుల్లా చేతికి గాయమైన నేపథ్యంలో అతడు బౌలింగ్ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వారిద్దరి స్థానాల్ని తాను వినియోగించుకుంటానని, అందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఇక బ్యాటింగ్‌లో మాత్రం తాను ప్రపంచకప్‌లో ఆడిన ఏడో నంబర్‌లోనే ఆడతానని చెప్పుకొచ్చాడు.