AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెస్సీ ఇండియాకు రావడంలేదు.. చివరి నిమిషంలో పర్యటన రద్దు! కారణం ఏంటంటే?

కేరళలో అర్జెంటీనా జాతీయ ఫుట్‌బాల్ జట్టు పర్యటన రద్దు అయింది. క్రీడా మంత్రి వీ. అబ్దుర్ రహీం ఈ విషయాన్ని ధృవీకరించారు. లియోనెల్ మెస్సీని చూడాలని ఎదురుచూస్తున్న లక్షలాది భారతీయ అభిమానులకు ఇది నిరాశాజనక వార్త. అక్టోబర్‌లో పర్యటన జరగాలని భావించారు కానీ, విదేశీ బృందం ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.

మెస్సీ ఇండియాకు రావడంలేదు.. చివరి నిమిషంలో పర్యటన రద్దు! కారణం ఏంటంటే?
Messi
SN Pasha
|

Updated on: Aug 05, 2025 | 4:30 PM

Share

స్టార్‌ ఫుట్‌బాల్ ప్లేయర్‌ లియోనెల్ మెస్సీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఇండియాలో ఫుట్‌బాల్‌కు ఆదరణ తక్కువే అయినా మెస్సీ, రొనాల్డొకు మాత్రం చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే మెస్సీ ప్రాతినిధ్యం వహించే అర్జెంటీనా జట్టు కేరళలో పర్యటించనుంది. ఈ పర్యటన సందర్భంగా కేరళకు మెస్సీ వస్తాడని, అతన్ని చూడొచ్చని భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆశపడ్డారు. అయతే వారికి నిరాశే ఎదురైంది. మెస్సీ, అర్జెంటీనా జాతీయ జట్టు ఈ సంవత్సరం కేరళను సందర్శించడం లేదని కేరళ క్రీడా మంత్రి వి అబ్దురహిమాన్ వెల్లడించారు.

భారతదేశంలోని లక్షలాది మంది ఫుట్‌బాల్ అభిమానులకు ఇది నిజంగానే చేదు వార్త. మెస్సీ లాంటి అత్యుత్తమ ఆటగాడిని తమ దేశంలో ప్రత్యక్షంగా చూడటానికి వారు ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఆ కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు రాష్ట్రాన్ని సందర్శిస్తుందని, స్పాన్సర్ ఇప్పటికే ఈవెంట్ కోసం మ్యాచ్ ఫీజు చెల్లించిందని మంత్రి ఇంతకుముందు పట్టుబట్టారు.

ఈ ఏడాది అక్టోబర్‌లో రాష్ట్రాన్ని సందర్శించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విదేశీ బృందం తమకు తెలియజేసిందని, అయితే స్పాన్సర్ “మేము అక్టోబర్ నెలలో సందర్శనపై మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాము” అని వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బృందం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, వారిని రాష్ట్ర అతిథులుగా పరిగణిస్తామని, వారికి భద్రత, వసతి, ప్రభుత్వం అందించే ఇతర సౌకర్యాలు ఉంటాయని అబ్దురహ్మాన్ ఇంతకుముందు చెప్పారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి