వేలు చూపించి అందరినీ కట్టడి చేసిన కోహ్లీ

వేలు చూపించి అందరినీ కట్టడి చేసిన కోహ్లీ

విశాఖ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరు అందరి మన్ననలను పొందుతుంది. ఈ మ్యాచ్‌కు భారత ఆటగాళ్లందరూ చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించుకుని హాజరైన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన అమర జవాన్లకు నివాళులర్పిస్తూ ఈ విధంగా చేయడం జరిగింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాల జాతీయ గీతాలాపనకు ముందుగా ఇరు జట్టు సభ్యులు […]

Vijay K

| Edited By: Srinu Perla

Mar 06, 2019 | 7:52 PM

విశాఖ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరు అందరి మన్ననలను పొందుతుంది. ఈ మ్యాచ్‌కు భారత ఆటగాళ్లందరూ చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించుకుని హాజరైన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన అమర జవాన్లకు నివాళులర్పిస్తూ ఈ విధంగా చేయడం జరిగింది.

అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాల జాతీయ గీతాలాపనకు ముందుగా ఇరు జట్టు సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అమర జవాన్లకు నివాళిగానే ఈ మౌనం పాటించారు. అయితే మౌనం పాటిస్తున్న సమయంలో కూడా ప్రేక్షకుల నుంచి అరుపులు, గోల వినిపించడంతో కోహ్లీ వాటిని కట్టడి చేసేందుకు ప్రయత్నించాడు. తాను ఉన్న స్థానం నుంచే నోటిపై వేలి పెట్టి నిశ్శబ్దంగా ఉండాలని కోరాడు.

కోహ్లీ చేసిన ఆ విజ్ఞప్తి బిగ్ స్క్రీన్‌పై చూసిన ప్రేక్షకులు గౌరవించి శబ్దాన్ని తగ్గించారు. ఇప్పుడు కోహ్లీ ప్రవర్తించిన ఈ తీరు అందరి మన్ననలను అందుకుంటోంది. పుల్వామా దాడి నేపథ్యంలో వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదనే డిమాండ్‌పై కోహ్లీ అంతకుముందు స్పందించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని, బీసీసీఐ, భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని పాటిస్తామని తెలిపాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu