AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్‌కప్‌లో కుల్‌దీప్ అదరగొడతాడు- పీయూష్ చావ్లా

కోల్‌కత్తా: ప్రపంచకప్‌లో టీమిండియా బౌలర్ కుల్‌దీప్‌యాదవ్‌ ప్రధాన బౌలర్‌గా ఆకట్టుకుంటాడని కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు పీయూష్‌ చావ్లా ఆశాభావం వ్యక్తం చేశాడు. కుల్‌దీప్‌ బౌలింగ్‌పై తనకెలాంటి సందేహం లేదని, మంచి టాలెండ్‌తోనే ఈస్థాయికి చేరుకున్నాడని కితాబిచ్చాడు. కెరీర్‌ ప్రారంభంలో కుల్‌దీప్‌ తనతో కలిసి ఆడిన అనుభవాలను చావ్లా గుర్తు చేసుకున్నాడు. కుల్‌దీప్‌ ఎప్పుడూ అనుమానాస్పద బౌలర్‌గా ముద్ర వేసుకోలేదని, అదొక అపోహ మాత్రమేనని చెప్పాడు. కుల్‌దీప్‌లో మంచి నైపుణ్యం దాగుందని, మరింత మెరుగ్గా రాణించేందుకు కష్టపడుతున్నాడని […]

వరల్డ్‌కప్‌లో కుల్‌దీప్ అదరగొడతాడు- పీయూష్ చావ్లా
Ram Naramaneni
|

Updated on: Mar 20, 2019 | 4:56 PM

Share

కోల్‌కత్తా: ప్రపంచకప్‌లో టీమిండియా బౌలర్ కుల్‌దీప్‌యాదవ్‌ ప్రధాన బౌలర్‌గా ఆకట్టుకుంటాడని కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు పీయూష్‌ చావ్లా ఆశాభావం వ్యక్తం చేశాడు. కుల్‌దీప్‌ బౌలింగ్‌పై తనకెలాంటి సందేహం లేదని, మంచి టాలెండ్‌తోనే ఈస్థాయికి చేరుకున్నాడని కితాబిచ్చాడు. కెరీర్‌ ప్రారంభంలో కుల్‌దీప్‌ తనతో కలిసి ఆడిన అనుభవాలను చావ్లా గుర్తు చేసుకున్నాడు. కుల్‌దీప్‌ ఎప్పుడూ అనుమానాస్పద బౌలర్‌గా ముద్ర వేసుకోలేదని, అదొక అపోహ మాత్రమేనని చెప్పాడు. కుల్‌దీప్‌లో మంచి నైపుణ్యం దాగుందని, మరింత మెరుగ్గా రాణించేందుకు కష్టపడుతున్నాడని అన్నాడు. వచ్చే ప్రపంచకప్‌లో కుల్‌దీప్‌, చాహల్‌ మంచి ప్రదర్శన చేసి టీమిండియాకి వికెట్లు తీసిపెడతారని చెప్పాడు. ఈ మధ్య కాలంలో కుల్‌దీప్‌ బాగా మెరుగయ్యాడని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో మంచి బ్యాట్స్‌మెన్‌ ఎదురైతే పెద్ద సవాల్‌గా మారుతుందని, వారిని అడ్డుకునేందుకు మంచి అవకాశం దొరుకుతుందని చావ్లా విశ్లేషించాడు.

Follow Us