AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీ కేర్ ఫుల్ టీం ఇండియా- ద్రవిడ్

ముంబయి: ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియా చేతిలో 2-3 తేడాతో సిరీస్‌ ఓటమి టీమిండియాకు హెచ్చరిక అని ఇండియన్ టీం మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత్‌-ఏ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. అయితే దేశ, విదేశాల్లో నిర్విరామంగా విజయాలు సాధిస్తున్న భారత్ జట్టకు తాజా ఓటమి మంచే చేసిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ‘మనం వరల్డ్‌కప్ సులభంగా అందుకుంటామని ప్రచారం జరుగుతోంది. ఆసీస్‌ సిరీస్‌లో జరిగిందంతా మన మంచికే. మెగా టోర్నీని క్రమశిక్షణతో, చాలా శ్రద్ధగా ఆడాలని ఆసీస్‌ ఓటమి […]

బీ కేర్ ఫుల్ టీం ఇండియా- ద్రవిడ్
Ram Naramaneni
|

Updated on: Mar 20, 2019 | 6:57 PM

Share

ముంబయి: ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియా చేతిలో 2-3 తేడాతో సిరీస్‌ ఓటమి టీమిండియాకు హెచ్చరిక అని ఇండియన్ టీం మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత్‌-ఏ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. అయితే దేశ, విదేశాల్లో నిర్విరామంగా విజయాలు సాధిస్తున్న భారత్ జట్టకు తాజా ఓటమి మంచే చేసిందని ఆయన అభిప్రాయపడ్డాడు.

‘మనం వరల్డ్‌కప్ సులభంగా అందుకుంటామని ప్రచారం జరుగుతోంది. ఆసీస్‌ సిరీస్‌లో జరిగిందంతా మన మంచికే. మెగా టోర్నీని క్రమశిక్షణతో, చాలా శ్రద్ధగా ఆడాలని ఆసీస్‌ ఓటమి గుర్తుచేస్తుంది. రెండేళ్లుగా భారత్‌ నిలకడగా రాణించింది. జట్టు సమతూకంగా ఉంది. అందుకే మనం ప్రపంచకప్‌ను సులభంగా అందుకుంటామని ప్రచారం జరుగుతోంది. ఆసీస్‌ సిరీస్‌ చూసిన తర్వాత నాకు వింతేమీ కనిపించలేదు. మనం ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాం. కానీ అక్కడ పోరు, ఒత్తిడి తీవ్రంగా ఉంటాయి’ అని ద్రవిడ్‌ అన్నారు.

ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై మిస్టర్‌ డిపెండబుల్‌ మాట్లాడారు. క్రికెటర్లకు విశ్రాంతినివ్వాలని ఫ్రాంచైజీలకు సూచించొద్దని పేర్కొన్నారు. ‘వారి శరీరాల గురించి ఆటగాళ్లకు బాగా తెలుసు. క్రమం తప్పకుండా ఆడితేనే తన బౌలింగ్‌ లయ బాగుంటుందని కమిన్స్‌ రాసిన కథనం చదివాను. పనిభారం ఒక్కో ఆటగాడికి ఒక్కోలా ఉంటుంది. అందరికీ విశ్రాంతి ఇవ్వాల్సిన పనిలేదు. ఆటగాళ్లను విశ్వసించాలి. ఏం చేయాలో వారికి తెలుసు’ అని ద్రవిడ్‌ తెలిపారు.

Follow Us
అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండా ఐపీఎల్ ట్రోఫీ పట్టేసిన కెప్టెన్స్
అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండా ఐపీఎల్ ట్రోఫీ పట్టేసిన కెప్టెన్స్
పార్లర్‌ తో పనిలేదు.. ఈ పండ్లతో మీ ముఖంలో గోల్డెన్ గ్లో ఖాయం!
పార్లర్‌ తో పనిలేదు.. ఈ పండ్లతో మీ ముఖంలో గోల్డెన్ గ్లో ఖాయం!
వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..
వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..
గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు..!
గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు..!
మటన్ కర్రీలో ఈ ఒక్కటీ వేసి వండితే వీధి మొత్తం ఘుమఘుమలే..
మటన్ కర్రీలో ఈ ఒక్కటీ వేసి వండితే వీధి మొత్తం ఘుమఘుమలే..
ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మాత్రం ఆ రిస్క్ తీసుకోలేదు..
ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మాత్రం ఆ రిస్క్ తీసుకోలేదు..
పడిపోతున్న వెండి ధర.. జస్ట్‌ 10 రోజుల్లో ఎంత తగ్గిందో తెలిస్తే..
పడిపోతున్న వెండి ధర.. జస్ట్‌ 10 రోజుల్లో ఎంత తగ్గిందో తెలిస్తే..
7వ తరగతిలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: బిగ్ బాస్ బ్యూటీ
7వ తరగతిలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: బిగ్ బాస్ బ్యూటీ
S అక్షరం ఉన్నవారి జీవితంలో ఊహించని మలుపు..ధనవంతులయ్యేది ఎప్పుడంటే
S అక్షరం ఉన్నవారి జీవితంలో ఊహించని మలుపు..ధనవంతులయ్యేది ఎప్పుడంటే
ఇజ్రాయెల్‌ దాడిలో IRGC అధికార ప్రతినిధి అలీ మహ్మద్‌ మృతి
ఇజ్రాయెల్‌ దాడిలో IRGC అధికార ప్రతినిధి అలీ మహ్మద్‌ మృతి