ఐపీఎల్ లో అత్యధికంగా సంపాదించిన క్రికెటర్స్ వీళ్ళే..!
ఐపీఎల్.. అటు స్టార్ ప్లేయర్స్ తో పాటు ఇటు లోకల్ క్రికెటర్స్ కు కూడా ఇది ఒక పెద్ద వరం. టీవీ కూడా కొనుక్కోలేని కొందరు లోకల్ ప్లేయర్స్ కు.. ఐపీఎల్ పుణ్యమా అని బెంజ్ కార్లలో తిరిగే రేంజ్ కు వెళ్ళిపోతున్నారు. ఇక ముఖ్యంగా యంగ్ క్రికెటర్స్ కు ఇది ఒక చక్కని ప్లాట్ ఫార్మ్ . వారిలోని టాలెంట్ ను గుర్తించి సెలెక్టర్లు భారత్ జట్టుకు ఎంపిక చేస్తున్నారు. కాగా స్టార్ క్రికెటర్స్ కొంతమంది […]

ఐపీఎల్.. అటు స్టార్ ప్లేయర్స్ తో పాటు ఇటు లోకల్ క్రికెటర్స్ కు కూడా ఇది ఒక పెద్ద వరం. టీవీ కూడా కొనుక్కోలేని కొందరు లోకల్ ప్లేయర్స్ కు.. ఐపీఎల్ పుణ్యమా అని బెంజ్ కార్లలో తిరిగే రేంజ్ కు వెళ్ళిపోతున్నారు. ఇక ముఖ్యంగా యంగ్ క్రికెటర్స్ కు ఇది ఒక చక్కని ప్లాట్ ఫార్మ్ . వారిలోని టాలెంట్ ను గుర్తించి సెలెక్టర్లు భారత్ జట్టుకు ఎంపిక చేస్తున్నారు. కాగా స్టార్ క్రికెటర్స్ కొంతమంది ఇప్పటికే వంద కోట్ల వరకూ వెనకేసుకున్నారు. ఇలా ఉంటే కొంతమంది రికార్డ్ స్థాయిలో ధర పలికి.. సీజన్ లో రాణించలేక.. తర్వాత సీజన్ లో వారి రేటు పడిపోవడం కూడా జరిగాయి. అయితే ఇవేవి దృష్టిలోకి రాకుండా.. ఓన్లీ ఐపీఎల్ ద్వారా కొంతమంది స్టార్ క్రికెటర్స్ ఇప్పటికే బిలియనీర్స్ అయ్యారు. వారెవరో ఇప్పుడు మనం చూద్దాం.

- మహేంద్ర సింగ్ ధోని :
ధోని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన శైలి కూల్ కెప్టెన్సీ తో, ట్రేడ్ మార్క్ షాట్స్ తో అభిమానులను బాగా అలరిస్తాడు. అంతేకాదు ఐపీఎల్ అనేసరికి మంచి ఊపు మీద కొడతాడు మహీ భాయ్. అలాంటి ధోని ఐపీఎల్ లో ఇప్పటివరకు సుమారు 122.84 కోట్లు సంపాదించినట్లు అంచనా.
కాగా 2008-10 దాకా సీజన్ కు 6 కోట్లు అందుకున్న ధోని.. ఆ తర్వాత నాలుగేళ్లు 8.28 కోట్లు అందుకున్నాడు. ఇక 2014-17 గానూ 12.5 కోట్లు తీసుకోగా… కాగా గతేడాది నుంచి 15 కోట్లు అందుకుంటున్నాడు ధోని.

- రోహిత్ శర్మ:
ఈ ఇండియన్ వైస్ కెప్టెన్ ఐపీఎల్ సంపాదనలో తన మాజీ కెప్టెన్ ధోనీ ని అనుసరిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు మూడు సార్లు టైటిల్ గెలిపించిన రోహిత్ శర్మ… మొదటి మూడు సంవత్సరాలు డెక్కన్ ఛార్జర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో సీజన్ కు 3 కోట్లు తీసుకున్న రోహిత్. ఆ తర్వాత 2011 నుంచి ఏకంగా 9.20 కోట్లు తీసుకుంటున్నాడు. 2014-17 వరకు సీజన్ కు 12.5 కోట్లు తీసుకుని.. 2018 నుంచి ధోనితో సమానంగా 15 కోట్లు తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారా రోహిత్ శర్మ సంపాదన 116. 60 కోట్లు.

- విరాట్ కోహ్లీ:
మొదటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ.. ఇంతవరకు జట్టుకు ట్రోఫీ అందించలేకపోయాడు. 2008 నుంచి తొలి మూడు సీజన్స్ కు కేవలం 1.20 కోట్లు మాత్రమే అందుకున్నాడు. ఆ తర్వాత 2013 నుంచి 8.28 కోట్లు తీసుకోగా.. 2014-17 దాకా సీజన్ కు 12.50 కోట్లు అందుకున్నాడు కోహ్లీ. 2018 నుంచి అందరి కంటే ఎక్కువగా 17 కోట్లు తీసుకుంటున్న ఈ ఇండియన్ కెప్టెన్ ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారా 109.20 కోట్లు సంపాదించాడు.

- సురేష్ రైనా:
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు సురేష్ రైనా. భారత్ జట్టులో పెద్దగా రాణించకపోయినా.. ఐపీఎల్ లో మాత్రం సంచలనాలు సృష్టిస్తాడు. ఇప్పటికే ఐపీఎల్ లో 4985 పరుగులు సాధించిన సురేష్ రైనా తొలి మూడు సీజన్లలో 2.60 కోట్లు అందుకున్నాడు. 2011-13 సీజన్లకు గానూ 5.98 కోట్లు అందుకున్నాడు. ఇక 2014-16 దాకా 9.50 కోట్లు తీసుకోగా.. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం పడింది. అప్పుడు గుజరాత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన రైనా సీజన్ కు 12.50 కోట్లు అందుకున్నాడు. ఆ తర్వాత 2018 నుంచి 11 కోట్ల ఒప్పందంతో చెన్నై జట్టుకు తిరిగి వచ్చాడు. ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారా రైనా సంపాదించింది 91.74 కోట్లు.

- గౌతమ్ గంభీర్:
భారత్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, ఐపీఎల్ ద్వారా ఇప్పటివరకు 94.6 కోట్లు సంపాదించాడు. మొదట ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గంభీర్ 2011 దాకా 5 కోట్లు అందుకున్నాడు. ఆ తర్వాత కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి 2017 వరకు సీజన్ కు 11 కోట్లు అందుకున్నాడు. కాగా 2018లో ఢిల్లీ జట్టు గంభీర్ ను 2.8 కోట్లకు కొనుగోలు చేయగా.. అర్ధాంతరంగా సీజన్ మధ్యలో ఢిల్లీ జట్టు నుంచే క్రికెట్ కు వీడ్కోలు పలికాడు గంభీర్.
ఇలా ఈ లిస్ట్ లో మరికొందరు భారత్ ఆటగాళ్లు ఉన్నారు. ఏది ఏమైనా ఐపీఎల్ ద్వారా క్రేజ్ తో పాటు సంపాదన కూడా దండిగానే వస్తుంది.
