IPL On Jio Cinema: 73 శాతం మంది వీక్షకులు జియో సినిమాలో ఐపీఎల్ చూస్తున్నారట.. నివేదిక విడుదల
స్పోర్ట్స్ అంటే చాలా మందికి ఇష్టమే. క్రెడిట్ జరుగుతుందంటే ఎంతో మంది టీవీలకే అతుక్కుపోతుంటారు. మరి కొంత మంది టీవీలకు అందుబాటులో లేకుంటే స్మార్ట్ ఫోన్‌లలో స్కోర్ చేస్తూ ఉంటారు. ఇక జియో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ టీవీలలో వీక్షకుల సంఖ్య పెరిగిపోతోంది. మొబైల్‌లు, కనెక్ట్..

స్పోర్ట్స్ అంటే చాలా మందికి ఇష్టమే. క్రెడిట్ జరుగుతుందంటే ఎంతో మంది టీవీలకే అతుక్కుపోతుంటారు. మరి కొంత మంది టీవీలకు అందుబాటులో లేకుంటే స్మార్ట్ ఫోన్‌లలో స్కోర్ చేస్తూ ఉంటారు. ఇక జియో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ టీవీలలో వీక్షకుల సంఖ్య పెరిగిపోతోంది. మొబైల్‌లు, కనెక్ట్ చేయబడిన టీవీలలో జియో-సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ టీవీలో స్టార్ స్పోర్ట్స్ కంటే మూడు రెట్లు ఎక్కువ IPL వీక్షకులను చేరుకుంటోందని సోర్స్ నివేదిక వెల్లడించింది. జియో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఐపీఎల్ వీక్షకులలో 73 శాతం మంది ఉండగా, కేబుల్, డీటీహెచ్‌లో కేవలం 27 శాతం వీక్షకులు ఉన్నారు. ఐపీఎల్‌లో ప్రకటనల ప్రభావాన్ని నివేదించేందుకు సింక్రోనీ ఇండియా, యునోమర్ చేసిన నివేదిక ‘స్కోర్’లో ఈ విషయం వెల్లడైంది.
కేబుల్ లేదా డిటిహెచ్‌లో కంటే స్మార్ట్ టీవీల్లోనే ఎక్కువ మంది ఐపిఎల్‌ని చూస్తున్నారని స్కోర్ నివేదిక చెబుతోంది. ఐపీఎల్‌ని కనెక్ట్ చేయబడిన టీవీలో 62% మంది వీక్షకులు, కేబుల్/డీటీహెచ్‌లో 38% మంది మాత్రమే వీక్షిస్తున్నారు. టీవీలో మొత్తం వీక్షకుల సంఖ్య కూడా నిరంతరం తగ్గుతోందని నివేదిక పేర్కొంది.
ఐపీఎల్ వీక్షణ విధానంలో కూడా ఆసక్తికరమైన మార్పులు వచ్చాయి. నివేదిక ప్రకారం.. 52% మంది ప్రజలు టీవీ, మొబైల్ రెండింటిలోనూ ఐపీఎల్ చూడటానికి ఇష్టపడుతున్నారు. ఐపీఎల్‌ని మొబైల్‌లో మాత్రమే చూసే వీక్షకులు 30% ఉండగా, ఇప్పటికీ 18% మంది మాత్రమే టీవీకి అతుక్కుపోతున్నారు. లెక్కలు చూస్తే మూడో వంతు మంది వీక్షకులు నేరుగా జియో-సినిమాకు కనెక్ట్ అయినట్లు స్పష్టమవుతోంది. 50 శాతం కంటే ఎక్కువ మంది వీక్షకులు మొబైల్, టీవీ రెండింటినీ ఉపయోగిస్తున్నారు.

Jio Cinema Ipl
స్కోర్ నివేదికలను రూపొందించడానికి యునోమర్ మార్కెట్ పరిశోధన ప్లాట్‌ఫారమ్‌లో రోజువారీ డేటా సమగ్రపరుస్తోంది. ఐపీఎల్ తొలి రెండు వారాల్లో తీసుకున్న శాంపిల్స్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, లూథియానా, జైపూర్‌ల నుంచి వివరాలను సేకరించారు.



