బంతి తగిలి అశోక్ దిండాకు తీవ్ర గాయం

కోల్‌కతా: బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి తగిలి టీమిండియా పేసర్ అశోక్ దిండా ముఖానికి తీవ్ర గాయమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం రెడీ అవుతున్న బెంగాల్ జట్టు సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో భాగంగా అశోక్ దిండా వేసిన బంతిని వివేక్ సింగ్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. అది నేరుగా వెళ్లి దిండా ముఖానికి తాకింది. బంతి బలంగా […]

బంతి తగిలి అశోక్ దిండాకు తీవ్ర గాయం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:38 PM

కోల్‌కతా: బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి తగిలి టీమిండియా పేసర్ అశోక్ దిండా ముఖానికి తీవ్ర గాయమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం రెడీ అవుతున్న బెంగాల్ జట్టు సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో భాగంగా అశోక్ దిండా వేసిన బంతిని వివేక్ సింగ్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. అది నేరుగా వెళ్లి దిండా ముఖానికి తాకింది. బంతి బలంగా తాకడంతో దిండా పిచ్‌పైనే కుప్పకూలాడు.

వెంటనే అతడిని నైటింగేల్ ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ అనంతరం అతడు బాగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 9 డిసెంబరు 2009లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన అశోక్ దిండా 13 వన్డేలు, 9టీ20లు ఆడాడు. 2013లో చివరిసారి భారత్ తరపున ఆడాడు. ప్రస్తుతం బెంగాల్ జట్టులో ప్రముఖ ఆటగాడిగా ఉన్నాడు.