సరికొత్త రూల్‌తో భారత్-వెస్టిండీస్ టీ20.. అదేంటంటే..?
శుక్రవారం హైదరాబాద్‌లో భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరిగే టీ20 మ్యాచ్ సరికొత్త నిబంధనకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ టీ20 మ్యాచ్‌లోనే ఐసీసీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. ఇప్పటి వరకు తరచూ నో బాల్స్ విషయంలో పెద్ద వివాదాలే రాజుకున్నాయి. నోబాల్స్ గుర్తించడంలో అనేకమార్లు అంపైర్లు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను గుర్తించే బాధ్యతను.. ఫీల్డ్ అంపైర్లు కాకుండా.. థర్డ్ అంపైర్‌కు అప్పగిస్తున్నట్లు ఐసీసీ.. గురువారం […]
శుక్రవారం హైదరాబాద్‌లో భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరిగే టీ20 మ్యాచ్ సరికొత్త నిబంధనకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ టీ20 మ్యాచ్‌లోనే ఐసీసీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. ఇప్పటి వరకు తరచూ నో బాల్స్ విషయంలో పెద్ద వివాదాలే రాజుకున్నాయి. నోబాల్స్ గుర్తించడంలో అనేకమార్లు అంపైర్లు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను గుర్తించే బాధ్యతను.. ఫీల్డ్ అంపైర్లు కాకుండా.. థర్డ్ అంపైర్‌కు అప్పగిస్తున్నట్లు ఐసీసీ.. గురువారం అధికారికంగా ప్రకటించింది. దీనికి శుక్రవారం భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరిగే టీ20 తొలి మ్యాచ్ కానుంది. ఈ సిరీస్‌తో పాటు.. కొన్ని నెలలు ఈ నిబంధనను పరిశీలించి.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ నిబంధనను అమలు చేసే దిశగా..ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా నిబంధన ప్రకారం.. థర్డ్ అంపైర్ ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను గుర్తించి.. ఫీల్డ్ అంపైర్‌కు తెలియజేస్తాడు. ఇక అదేవిధంగా థర్డ్ అంపైర్‌తో డిస్కషన్ చేయకుండా.. ఫీల్డ్ అంపైర్ నోబాల్స్‌ను డైరక్ట్‌గా ప్రకటించకూడదు. ఒక వేళ బ్యాట్స్‌మన్ ఔటైన బాల్.. నోబాల్ అని థర్డ్ అంపైర్ గుర్తించి ప్రకటిస్తే.. ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి. ఈ ఒక్క నిబంధన మాత్రమే తప్ప.. మిగతా విధులు, బాధ్యతలన్నీ.. ఫీల్డ్ అంపైర్‌కు యథావిధిగా కొనసాగుతాయని.. ఐసీసీ పేర్కొంది.